బ‌ద్వేల్‌: ఇక్క‌డ మెజార్టీపై వైసీపీ అంచ‌నా నిజ‌మ‌య్యేనా ?

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌పలోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఈ నెల 30న అంటే శుక్ర‌వారం ఉప ఎన్నిక జ‌ర‌గ నుంది. ఇప్ప‌టికే ఇక్క‌డ జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. నిజానికి ఇక్క‌డ కేవ‌లం వైసీపీ మాత్ర‌మే బ‌రిలో ఉంది. కానీ.. మ‌ద్య‌లో బీజేపీ ఇక్క‌డ పోరుకు దిగింది. వార‌స‌త్వ‌రాజ‌కీయాల‌ను తాము ప్రోత్స‌హించేది లేద‌ని.. ఆ పార్టీ నేత‌లు ఇక్క‌డ పోటీ పెట్టా రు. ఈ క్ర‌మంలో కేంద్రంలోని ప‌లువురు మంత్రులు స‌హా.. రాష్ట్ర నాయ‌కులు కూడా ఇక్క‌డ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. నియోజ‌క‌వ‌ర్గంలో పోరును ఉధ్రుతం చేశారు.

దీంతో ప్ర‌చారం హోరాహోరీగానే సాగింద‌ని చెప్పాలి. బీజేపీ.. నాయ‌కులు..వైసీపీ వైఫ‌ల్యాలు స‌హా.. కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న నిదులు.. ఇత‌ర త్రా అంశాల‌ను ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు తీసుకువెళ్లారు. అదేస‌మ‌యంలో బ‌ద్వేల్ అభివృద్దికి ప్రాధాన్యం ఇస్తామ‌ని.. హామీ ఇచ్చారు. ఇక‌, వైసీపీ నాయ‌కులు ఇంటింటి ప్ర‌చారం స‌హా.. ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను భారీ ఎత్తున ప్ర‌చారం చేశారు. మొత్తంగా చూస్తే.. పైకి ప్ర‌ధాన మీడియాలో ఎలాంటివార్త‌లు రాక‌పోయినా.. స్థానికంగా మాత్రం సార్వ‌త్రిక స‌మ‌రం త‌ల‌పించేలా.. ప్ర‌చారం జ‌రిగింది.

ఈ క్ర‌మంలో వైసీపీ అభ్య‌ర్థిగా ఉన్న డాక్ట‌ర్ సుధ‌కు ఏమేర‌కు మెజారిటీ వ‌స్తుంద‌నే అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. అయితే.. దీనికి వైసీపీ నాయ‌కులు త‌మ‌కు ల‌క్ష మెజారిటీ ఖాయ‌మ‌ని అంటున్నారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఏమీ చేయ‌కుండానే జిల్లాలో అభ్య‌ర్థులు భారీ మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నార‌ని.. అదేస‌మ యంలో బ‌ద్వేల్‌లోనూ.. దివంగ‌త వెంక‌ట‌సుబ్బ‌య్య‌..50 వేల పైచిలుకు మెజారిటీతో విజ‌యం సాధించార‌ని.. సో.. ఇప్పుడు జ‌గ‌న్ అనేక సంచ‌ల‌న ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నందున‌.. ఆ ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని.. అదేస‌మ‌యంలో వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణిగా ఆమెపై సింప‌తీ ప‌వ‌నాలు వీస్తాయ‌ని.. చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో త‌మ‌కు ల‌క్ష‌కు త‌గ్గ‌కుండా మెజారిటీ ల‌భిస్తుంద‌ని.. ఖ‌చ్చితంగా చెబుతున్నారు అయితే.. బీజేపీ మాత్రం త‌మ అభ్య‌ర్థి గెలుపు ఖాయ‌మ‌ని ఢంకా ప‌థంగా చెబుతోంది. ఈ క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు చెబుతున్న‌ట్టు ల‌క్ష మెజారిటీ ఖాయ‌మా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: