కేసీఆర్ Vs. ఈటెల: రెండు రోజులుగా కొత్త టాక్ వినపడుతోందిగా..!
అక్కడ ఒక్కో ఓటు రేటు రు. 20 వేలకు పైనే పలుకు తోందని కూడా అంటున్నారు. ఇక ఒక ఇంట్లో 10 ఓట్లు ఉంటే రు. 3 లక్షలు అధికార పార్టీ వెద జల్లుతోందన్న ప్రచారం కూడా కొద్ది రోజులుగా నడుస్తోంది. ఇక పలు ప్రైవేటు సర్వే సంస్థలు కూడా అక్కడ నెల రోజులుగా మకాం వేసి వరుసగా సర్వేలు చేస్తున్నాయి. ఇక అధికార టీఆర్ ఎస్ అయితే తాము 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ముందు నుంచి ధీమాగా ఉంది. ఇక చాలా మంది మాత్రం ఈటలకు సానుభూతి ఉందని.. ఆయనే గెలుస్తారని చెపుతున్నారు.
ఏదెలా ఉన్నా చివరి రెండు రోజుల నుంచి మాత్రం ఈటలకు అనుకూలంగా అక్కడ టాక్ వినిపిస్తోందని అంటున్నారు. హుజూరాబాద్ లో ఈటెల కు ఛాన్స్ ఉందని రెండు రోజుల నుంచి పలువురు రాజకీయ విశ్లేషకులతో పాటు మేథావుల అంతర్గత చర్చల్లో వినపడుతోంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సర్వే లో 30 వేల తో ఈటెల గెలుస్తాడు అని తేలిందట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. మరి కొందరు మాత్రం టఫ్ ఫైట్ ఉన్నా ఈటలే బయట పడతాడని అంటున్నారు.