కేసీఆర్ Vs. ఈటెల : హారీషు పరిస్ధితేందో ?

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్ర‌చారం ఈ రోజుతో ముగుస్తోంది. ఇక్క‌డ గెలుపు ఎవరిది ? అవుతుంది అన్న దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అధికార పార్టీ ఈ ఉప ఎన్నిక‌ గెలిస్తే క్రెడిట్ ఎవ‌రి ఖాతాలో ప‌డుతుంది ?  ఓడితే ఎవ‌రి ఖాతాలో ప‌డుతుంది అన్న దానిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. గ‌త ఉప ఎన్నిక‌ల్లో పార్టీకి గెలిచే స్కోప్ ఉన్న ప్ర‌తి చోటా కేసీఆర్ ముందుగానే కేటీఆర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ వ‌చ్చారు. అది హుజూర్‌న‌గ‌ర్ కావ‌చ్చు, నాగార్జునా సాగ‌ర్ కావ‌చ్చు.. అదే దుబ్బాక లాంటి చోట ఉప ఎన్నిక జ‌రిగితే కేసీఆర్‌, కేటీఆర్ అటు వైపే తొంగి చూడ‌లేదు. అక్క‌డ బాధ్య‌త‌లు అన్ని మంత్రి హ‌రీష్ రావుకే అప్ప‌గించారు. అక్క‌డ పార్టీ ఓడిపోయింది. అస‌లు తెలంగాణ రాష్ట్ర స‌మితి ఏ ఉప ఎన్నిక‌ల్లో అయినా ఓట‌మి అనేదే లేకుండా గెలుస్తూ వ‌స్తోంది.

పైగా రాష్ట్రం ఏర్ప‌డ్డాక ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేలు చ‌నిపోయిన చోట ఉప ఎన్నిక‌లు జ‌రిగితే కూడా సుల‌వుగా గెలిచింది. అలాంటి త‌మ పార్టీ ఎమ్మెల్యే చ‌నిపోయిన సిట్టింగు సీటులో .. అది కూడా కేసీఆర్ సొంత జిల్లా.. అక్క‌డ దివంగ‌త సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య‌ను పోటీ చేయించినా కూడా గెల‌వ‌లేదు. ఆ ప‌రాజ‌యాన్ని తెలివిగా హ‌రీష్ ఖాతాలో వేసేశారు. ఇక ఇప్పుడు హ‌రీష్ రావుకు సంక్లిష్ట‌మైన హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్య‌త‌ను అప్ప‌గించారు. హ‌రీష్ కొద్ది నెల‌లుగా ఇక్క‌డే మ‌కాం వేసీ మ‌రి ఉప ఎన్నిక బాధ్య‌త‌లు చూస్తున్నారు.

హ‌రీష్ కు ఒక‌ప్పుడు పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ పేరు ఉండేది. ఇప్పుడు కేవ‌లం ఓ ప్లే కోర్ట్ మాదిరిగా మారిపోయారు. ఇక్క‌డ గెలిస్తే ఆ క్రెడిట్ ఖ‌చ్చితంగా హ‌రీష్ రావుకు ఇవ్వ‌రు.. అది కేసీఆర్ ఖాతాలో ప‌డిపోతుంద‌నే అంటున్నారు. ఒక వేళ ఇక్క‌డ పార్టీ ఓడిపోతే అది హ‌రీష్ రావుకు అంట గ‌ట్టేసి మొన్న దుబ్బాక‌, ఇప్పుడు హుజూరాబాద్‌లో ఆయ‌న పార్టీని గెలిపించ‌లేక‌పోయారు. అలాంటి వాడికి రేపు పార్టీ బాధ్య‌త‌లు ఇస్తే ఏం చేస్తారంటూ ఆయ‌న్ను తెలివిగా సైడ్ చేసే కార్య‌క్ర‌మం జ‌రిగినా జ‌ర‌గ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: