బిజేపి లోకి వెళ్ళిన ఈటల రాజేందర్ గెలుపు సాధ్యమేనా ?

Veldandi Saikiran
హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికకు   కౌంట్ డౌన్ మొదలైంది అన్న సంగతి తెలిసిందే. హుజరాబాద్ నియోజక వర్గ   ఉప ఎన్నికలకు కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందులో కేవలం ఐదురోజుల ప్రచార సమయం అన్ని పార్టీల చేతుల్లో ఉంది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో... అన్ని పార్టీలు ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతోంది.    ఇక హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక..లో కేవలం అధికార టిఆర్ఎస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ ల మధ్యనే పోటీ ఉంటుందని... హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా  చెబుతున్నారు. 

అయితే... ఇది ఇలా ఉండగా... అధికార టీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారాన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన అప్పటి నుంచి... ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం అందుతుంది. వామపక్ష భావాలు ఉన్న ఈటల రాజేందర్... ఇప్పటివరకూ జైశ్రీరామ్ అనకపోవడం దీనికి అసలైన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అలాగే హైదరాబాద్ నియోజకవర్గం లోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ఈటల రాజేందర్ కార్యకర్తల మధ్య అస్సలు సఖ్యత ఉండటం లేదట. వారి మధ్యలో గ్రూప్ తగాదాలు నెలకొంటున్నాయి అని చర్చ జరుగుతోంది.

ఇక అటు అధికార టీఆర్ఎస్ పార్టీ.. ప్రచారంలో దూసుకు వెళుతోంది. పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు పెంపుదలను టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. దీంతో ఈటల రాజేందర్ శిబిరంలో... కొంత ఆందోళన కూడా మొదలైందట.  నిత్యం పెరుగుతున్న ధరల కారణంగా ఓటర్లు తమ వైపు ఉంటారో ? లేదో అన్న ఆలోచన అందరిలో మెదులుతూ ఉండటం. మొత్తానికి భారతీయ జనతా పార్టీ లోకి వెళ్ళిన ఈటల రాజేందర్ కు.. మొదటి నుంచి ఇలా అన్ని తలనొప్పులు వస్తున్నాయట. ఇలాంటి తరుణంలో హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లు ఎటువైపు ఉంటారు అనేది తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: