విశాఖ :- తెలుగు దేశం పార్టీ ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు వైసీపీ పార్టీ రాజ్య సభ సభ్యులు ఎంపీ విజయ సాయి రెడ్డి. భీమిలి నియోజకవర్గంలో మంత్రి అవంతి శ్రీనివాస్ చేపట్టిన జనాగ్రహ దీక్షకు సంఘీభావం ప్రకటించారు ఎంపీ విజయ సాయి రెడ్డి... ప్రపంచంలో అతి తెలివి తక్కువ వాడు లోకేష్ మాత్రమేనని.. బుర్ర తప్ప అన్ని చెడ్డ అలవాట్లు ఉన్న వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
లోకేష్ ను బరువు తగ్గించుకో మంటే బుర్ర కూడా తగ్గించుకున్నాడని.. ఉన్న బుర్రె కాస్తంత డైటింగ్ తర్వాత ఉన్నదంతా పోయిందన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి... బాడీ తగ్గడానికి లోకేష్ కు ఇంట్లో తిండిపెట్టడం మానేశారని.. ఆకలి వల్ల వచ్చే కోపంను ప్రభుత్వంపైన, ప్రజాలపైన చూపిస్తున్నాడని ఫైర్ అయ్యారు ఎంపీ విజయ సాయి రెడ్డి. చంద్రబాబు ఒక పొలిటికల్ టూరిస్ట్ అని.. కరకట్ట మీద లాక్కున్న ఇల్లు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా ఇల్లు కూడా లేని నేత చంద్రబాబు అని చురకలు అంటించారు. వెలగపూడి గంజాయి,గుట్కా,లిక్కర్ వ్యాపారాలు చేసి ఎదిగారని పేర్కొన్న ఎంపీ విజయ సాయి రెడ్డి.. విమర్శలు సహేతుకంగా లాజిక్ ఉండాలని వెల్లడించారు.
టీడీపీ పార్టీ నాయకులు వ్యవహారశైలి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని మండిపడ్డారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ప్రజలను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు ఎంపీ విజయ సాయి రెడ్డి. పట్టాభి లాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు....ఇలాంటి వాళ్ళ వెనుక ఉన్న లోకేష్, చంద్రబాబులు అంతా చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. చంద్ర బాబు కు ప్రజల మనసును తెలుసుకుని పాలించే యోగ్యతలు లేవన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి. అందుకే ప్రజలు తిరస్కరించారు.... ఈ జన్మకి చంద్రబాబుకి రాజయోగం లేదని ఎద్దేవా చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి...