సజ్జనార్ వార్నింగ్.. ఎవరికో తెలుసా?

praveen
మొన్నటి వరకు సైబరాబాద్ సిపి గా నేరస్తులు అందరినీ గడగడలాడించాడు సజ్జనార్. ఏకంగా ఆడపిల్లలపై హత్యాచారం చేయాలి అనే నిందితులు అందరిలో కూడా వెన్నులో వణుకు పుట్టించాడు.  గతంలో హైదరాబాద్లో జరిగిన ఒక అత్యాచారం హత్య ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేశాడు సజ్జనార్. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కూడా సీపీ సజ్జనార్ ఎంతగానో పేరు తెచ్చుకున్నాడు. అయితే మొన్నటివరకు సైబరాబాద్ సీపీ గా ఉన్న సజ్జనార్ ను ఇటీవలే ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. సైబరాబాద్ సీపీ నుంచి ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సజ్జనార్.

 అయితే గతంలో సి పి గా ఉన్నప్పుడు ఎంతో దూకుడుగా వ్యవహరించినా సజ్జనార్ ఇక ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా మారిన తరువాత కూడా అదే దూకుడు తో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ ఆర్టీసీ నీ గట్టెక్కించేందుకు సీపీ సజ్జనార్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి. ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు అందించడమే కాదు మరోవైపు సంస్థను గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారు సజ్జనార్. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు రూల్స్ అమలులోకి తీసుకు వచ్చారూ అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లందరికి కూడా ప్రస్తుతం ఒక స్మూత్ వార్నింగ్ ఇచ్చారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ బస్సు నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై చర్యలు తీసుకుంటాము అంటూ హెచ్చరించారు. సిబ్బంది అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ తెలిపారు. అంతే కాదు ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ డ్రైవర్ల తప్పు లేకపోతే వారిపై పోలీసు కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  ఆర్టీసిలో పనిచేస్తున్న 2,700 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నవంబర్ నుంచి కొత్త వేతనాలు ఇచ్చేందుకు నిర్ణయించాము అంటూ సీపీ సజ్జనార్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: