కేశినేని స్కెచ్ బాగానే ఉంది... సెట్ అయిపోతుందా?

M N Amaleswara rao
రాజకీయాల్లో నాయకులు తమ అధినేతలని ఎప్పటికప్పుడు పొగుడుతూ ఉండాలి...ఆహా భళా అంటూ భజన చేయాలి. అప్పుడే అధినేతలకు బాగుంటుంది. అలా కాకుండా ఆ తప్పు, ఈ తప్పు అని చెబితే మాత్రం ఆ అధినేతలు, నాయకులని పక్కనబెట్టేస్తారు. ఏపీలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు కూడా అదే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఎలాగో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నాయకుల చేత బాగా భజన చేయించుకున్నారు. దాని వాళ్ళ పార్టీకి ఎంత నష్టం జరగాలో...అంత నష్టం జరిగింది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఓడిపోయాక కూడా బాబు తీరు మారడం లేదు...భజన చేసే వాళ్ళని పక్కనబెట్టుకుంటూ...తప్పులు ఎత్తిచూపే నాయకులని సైడ్ చేస్తున్నారు. సీనియర్ నేత బుచ్చయ్య చౌదరీ లాంటి వారిని కూడా అలాగే సైడ్ చేశారు. పార్టీలో తప్పులు జరుగుతున్నాయంటే, బుచ్చయ్యని పక్కనబెట్టేశారు.


ఇక తన మాట వినడం లేదని చెప్పి బుచ్చయ్య పార్టీకి రాజీనామా చేసేస్తానని, ఇక రాజకీయాలకు దూరమైపోతానని అన్నారు. దీంతో బాబు వెనక్కి తగ్గారు. బుచ్చయ్యని బుజ్జగించి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక బుచ్చయ్య వర్షన్‌లోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని వస్తున్నట్లు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి కేశినేని....పార్టీలో ఉన్న లోపాలని ఎత్తిచూపిస్తూనే ఉన్నారు. అయితే బహిరంగంగానే సొంత పార్టీ నాయకులపై కేశినేని విమర్శలు చేశారు. ఇదే ఇబ్బంది అయింది. చంద్రబాబుకు భజన చేసే నాయకులు కేశినేనిపై ఫైర్ అయ్యారు.
కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో కేశినేనికి సపోర్ట్ ఇవ్వలేదు. దీంతో ఈ మధ్యే కేశినేని కూడా ఇక ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేశారు. తాజాగా తన కేశినేని భవన్‌లో కొన్ని మార్పులు చేశారు. దీంతో కేశినేని టి‌డి‌పిని వీడి బి‌జే‌పిలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ కేశినేని బి‌జే‌పిలో వెళ్ళే పరిస్తితి లేదు. అసలు ఏపీలో బి‌జే‌పికి అంత సీన్ లేదు. అటు వైసీపీపై కూడా వ్యతిరేకత పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో కేశినేని అసలు పార్టీ మారుతారని ఎలా అనుకున్నారని ఆయన అనుచరులు మాట్లాడుతున్నారు. బాబులో మార్పు తీసుకురావడానికే కేశినేని చిన్న స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. మరి కేశినేని ఎఫెక్ట్‌తో విజయవాడలో టి‌డి‌పి సెట్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: