మోత్కుప‌ల్లికి కేసీఆర్ ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్ ఇదే...!

VUYYURU SUBHASH
తెలంగాణ రాజకీయాల్లో మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ది కీల‌క‌మైన ప్ర‌స్థానం. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారిన ఆయ‌న ఈ రోజు సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా క‌ప్పుకోనున్నారు. తెలంగాణ లో ప‌లువురు కీల‌క నేత‌ల స‌మ‌క్షంలో  తెలంగాణ భవన్ లో ఆయన పార్టీలో చేరనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు మోత్కుపల్లి నరసింహులు పార్టీలో చేరడం గులాబీ పార్టీకి బాగా కలసి వస్తుందని.. ద‌ళితుల ఓటు బ్యాంకు కొంత వ‌ర‌కు కారు పార్టీకి ట‌ర్న్ అవుతుంద‌ని అంటున్నారు.

ఇక మోత్కుపల్లి నరసింహులు విష‌యానికి వ‌స్తే ఆయ‌న‌ తెలంగాణలో సీనియర్ నేత. దళిత నేతగా ఆయన అనేక పదవులను పొందారు. ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలోని ఆలేరు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం గా ఉన్న‌ప్పుడు ఆయ‌న అక్క‌డ నుంచి టీ డీపీ త‌ర‌పున మ‌ధ్య‌లో ఓ సారి కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2008 ఉప ఎన్నిక‌ల‌లో ఆయ‌న ఆలేరు లో టీడీపీ నుంచి ఓడిపోయారు. త‌ర్వాత 2009లో ఆలేరు జ‌న‌ర‌ల్ కావ‌డంతో 2009లో ఆయ‌న తుంగ‌తుర్తి నుంచి పోటీ చేసి మ‌ళ్లీ ఎమ్మెల్యే అయ్యారు.

ఇక 2014 లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని మ‌థిర నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి భ‌ట్టి విక్ర‌మార్క్ చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత తెలుగు దేశం నుంచి చంద్ర‌బాబు త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపుతార‌ని అనుకున్నారు. చివ‌ర‌కు ఎన్డీయేతో పొత్తు ఉండ‌డంతో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అయినా వ‌స్తుంద‌నుకున్నారు. ఆ ప‌ద‌వులు రాలేదు. ఆ త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేరారు. ఇప్పుడు టీఆర్ ఎస్‌లో చేరుతున్నారు. కేసీఆర్ మోత్కుప‌ల్లిని రాజ్య‌స‌భ‌కు పంపుతాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక కేసీఆర్ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ద‌ళిత బంధు ప‌థ‌కానికి తాను ఎంతో ఆక‌ర్షితుడిని అయ్యాన‌ని మోత్కుప‌ల్లి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: