ఆ వైసీపీ లేడీ ఎమ్మెల్యే.. అక్కడ టీడీపీని గెలిపించేస్తారుగా...!
ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల్లో టిడిపి కూడా వేగంగానే పుంజుకుంటుంది. అలా టిడిపికి అనుకూలంగా మారుతున్న నియోజకవర్గాల్లో పాతపట్నం కూడా ఒకటి. పాతపట్నం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ టిడిపి ఆరుసార్లు విజయం సాధించింది.
అయితే గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టిడిపి ఓటమి పాలవుతూ వస్తుంది. 2014 ఎన్నికల్లో కలమట వెంకట రమణ మూర్తి వైసీపీ నుంచి గెలిచి, టిడిపిలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో వెంకటరమణ టిడిపి నుంచి పోటీ చేయగా, వైసీపీ నుంచి రెడ్డి శాంతి పోటీ చేసి గెలిచారు. దీంతో రెండు సార్లు టిడిపి ఓడిపోవాల్సి వచ్చింది. కానీ ఈ సారి పరిస్తితి ఉన్నట్లు కనిపించడం లేదు. టిడిపి వేగంగానే పుంజుకుంటుంది. వెంకటరమణ దూకుడుగా పనిచేస్తూ, పార్టీని బలోపేతం చేస్తున్నారు. మామూలుగానే పాతపట్నంపై వెంకటరమణ ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. గతంలో వెంకటరమణ తండ్రి మోహన్ రావు టిడిపి తరుపున పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
తండ్రి బాటలోనే వెంకటరమణ టిడిపిలోకి వచ్చి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2014లో వైసీపీలోకి వెళ్ళి గెలిచారు...మళ్ళీ టిడిపిలోకి వచ్చి 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ఈ సారి టిడిపి తరుపున కలమట గెలవడం ఖాయమని తెలుస్తోంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు అంత అనుకూలమైన వాతావరణం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. మొత్తాని కైతే పాతపట్నంలో కలమట...టిడిపి జెండా ఎగరవేసేలా ఉన్నారు.