టీడీపీలో ముళ్లపూడికి మళ్లీ కష్టమేనా...!
2009 ఎన్నికలలో చివర్లో అనూహ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నుంచి సీటు దక్కించుకున్న ఆయన గట్టిగానే కష్టపడ్డారు. అయితే అప్పుడు ప్రజారాజ్యం వేవ్‌లో అక్కడ మాత్రం ఆ పార్టీ గెలిచింది. అయినా ముళ్లపూడికి టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో బాగానే ఓట్లు వచ్చాయి. కట్ చేస్తే ఐదేళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బాగానే కష్టపడ్డారు. అయితే 2014 ఎన్నికలకు ముందు జనసేన తో పొత్తు ఉండడంతో బాపిరాజుకు సీటు ఇవ్వడం కుదర్లేదు. అయితే అందుకు ప్రతిపలంగా బాబు ఆయనకు పశ్చిమ జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉండడంతో పాటు అప్పుడు తాడేపల్లిగూడెం నుంచి మంత్రిగా ఉన్న బీజేపీ నేత, దివంగత పైడికొండల మాణిక్యాల రావుతో గట్టిగానే ఫైట్ చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు సామాజిక సమీకరణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి సీటు ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిన ఆయన పార్టీకి దూరంగా ఉండడంతో బాబు ఆయన్ను పక్కన పెట్టేసి మరో నేత వలవల బాబ్జీకి సీటు ఇచ్చారు. బాబ్జీ నియోజకవర్గంలో దూసుకు పోతున్నారు.
ఇక్కడ బాబ్జీకే సీటు అంటున్నారు. ఒక వేళ టీడీపీ - జనసేన పొత్తు ఉంటే.. ఇక్కడ జనసేన బలంగా ఉండటంతో ఈ సీటును వదులుకునే అవకాశం లేదని తెలుస్తోంది. సో ఈ ఈక్వేషన్లు చూస్తే ముళ్లపూడి బాపిరాజుకు ఈసారి కూడా టిక్కెట్ దక్కే అవకాశం లేదన్న చర్చలు వినిపిస్తున్నాయి.