వైసీసీ స‌ర్వేలో అనంత‌పురంలో టీడీపీ గెలిచే 5 సీట్లు ఇవే...!

VUYYURU SUBHASH
రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే..  అధికార పార్టీ వైసీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి.?  ప్ర‌ధాన ప్ర‌తిప క్షంగా ఉన్న టీడీపీకి ఎన్ని స్థానాలు ద‌క్కుతాయి? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. ఇదే విష‌యంపై వైసీపీకి చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ఫ‌లితం ఎలా ఉంటుందో తేల్చి చెప్పింది. దీనిలో భాగంగా రాయ‌ల‌సీమ‌లోని ప్ర‌ముఖ జిల్లా అనంత‌పురంలో నిర్వ‌హిం చిన స‌ర్వేలో .. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి ఐదు స్థానాలు ద‌క్కుతాయ‌ని స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. వీటి లోనూ గ‌త ఎన్నిక‌ల్లో  విజ‌యం ద‌క్కించుకున్న హిందూపురం కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. అనంత‌పురంలోని హిందూపురం, క‌దిరి, క‌ళ్యాణ‌దుర్గం, తాడిప త్రి, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గాలు.. టీడీపీ కైవ‌సం అవ‌డం ఖాయ‌మ‌నే విష‌యం.. ఈ స‌ర్వేలో స్ప‌ష్ట‌మైంది. దీనికి కార‌ణాల‌ను కూడా ఈ స‌ర్వే వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం చూసుకుంటే.. వ‌రుస విజ‌యాల‌తో ఇక్క‌డ నంద‌మూరి బాల‌య్య విజ‌యం సాధిస్తున్నారు. వచ్చే ఎన్నిక‌ల‌లోనూ ఆయ‌న హవా అలానే సాగ‌నుంది. పైగా.. బాల‌య్య లేకున్నా.. ఇక్క‌డ ప‌నులు జ‌రుగుతుండ‌డం.. బాల‌య్య వ్య‌క్తిగ‌త ఇమేజ్ త‌గ్గ‌క‌పోవ‌డం.. వంటివి ఇక్క‌డ టీడీపీకి ప్ల‌స్ గా మారాయి.

ఇక‌, క‌దిరిలో టీడీపీ యువ నాయ‌కుడు కందికుంట వెంక‌ట ప్ర‌సాద్.. ప‌ట్ల స్థానికంగా సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్నాయి. వ‌రుస ప‌రాజ‌యాలు పొందినా.. ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గడుతున్నారు. అడిగిన వారికి కాద‌న‌కుండా.. సాయం చేస్తున్నారు. దీంతో కందికుంట ఇమేజ్ పుంజుకుని.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో  టీడీపీ నాయ‌కుడు  మాదినేని ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు హ‌వా జోరుగా సాగుతోంది. ఇక్క‌డ నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌.. త‌న సొంత ప‌నుల‌తో బెంగ‌ళూరులోనే మ‌కాం వేయ‌డంతో.. ఇక్క‌డ టీడీపీ ప్ర‌జ‌ల‌కు చేరువైంది. ఈ ప‌రిణామం.. మాదినేనికి ప్ల‌స్‌గా మారింది. దీంతో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. మాదినేని గెలుపు ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.

అనంత‌లో టీడీపీ గెలిచే మ‌రో స్థానం తాడిప‌త్రి. ఇక్క‌డ జేసీ బ్ర‌ద‌ర్స్ ప‌ట్టు గురించి ప్ర‌త్యేకంగా చెప్పే ప‌నిలేదు. ద‌శాబ్దాలుగా ఇక్క‌డ వారు పాగా వేశారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచినా.. మ‌ళ్లీ ప్ర‌జ‌లు జేసీ వ‌ర్గంవైపే ఉన్నారు. ఇటీవ‌ల తాడిప‌త్రి మునిసిపాలిటీని ఈ కుటుంబ‌మే ద‌క్కించుకుంది. సో.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌జ‌రిగితే.. జేసీదే తాడిప‌త్రి అంటున్నారు ప్ర‌జ‌లు.

ఇక‌, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిటాల శ్రీరాం కేవ‌లం గెల‌వ‌డ‌మే కాదు.. భారీ మెజారిటీని సైతం సొంతం చేసుకుంటార‌ని.. చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కొద్దితేడాతో త‌ప్పిపోయిన విజ‌యం ఈ సారి భారీ మెజారిటీతో ద‌క్కించుకుంటార‌ని అంటున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండ‌డం.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు కృషి చేయ‌డం వంటివి బాగా క‌లిసి వ‌స్తున్నాయి. సో.. మొత్తంగా ఐదు చోట్లా టీడీపీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ వ‌ర్గాలు నిర్వ‌హించిన స‌ర్వేలోనే స్ప‌ష్టం కావ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: