ఈటెల :కేసీఆర్ చరిత్రే అబద్ధాలు చరిత్ర..!

MOHAN BABU
హుజురాబాద్ ఉప ఎన్నిక  ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈటల రాజేందర్ ప్రచారంలో భాగంగా కెసిఆర్ పాలన పై నిప్పులు చెరిగారు. రాబోవు రోజుల్లో కెసిఆర్కు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఈ ఆత్మగౌరవానికి అహంకారానికి జరుగుతున్న ఉప ఎన్నిక అని  తెలియజేశారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్  తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదన్నారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్. తనను ఓడించడం అనేది ఎవరి వల్లా కాదన్నారు. కెసిఆర్, హరీష్ రావు చరిత్రనే అబద్ధాలు చరిత్ర అన్నారు. దళిత బంధు ఇవ్వకపోతే కేసీఆర్ కి రాజకీయ సమాధి కట్టడం ఖాయమన్నారు బొడిగె శోభ. కెసిఆర్ ఎంగిలి మెతుకులు తినే వారికి ఈటెలను విమర్శించే స్థాయి లేదన్నారు నేతలు. 2023 లో టిఆర్ఎస్ ను బొంద పెట్టేందుకు రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత కెసిఆర్ పీఠం కూల్చుతానన్నారు. నీవు ఎక్కడ తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పబ్బతి  పట్టిన నీకు నా ప్రజలు ఓట్లు వేయరు అని ఈటెల రాజేందర్ అన్నారు.


 హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ వాళ్ళకి బుల్లెట్ దిగాలి అన్నారు. దళిత బిడ్డలకు పదిలక్షలు వస్తున్నాయనడానికి కారణం తానేనని ఈటెల రాజేందర్ అన్నారు. అన్ని కులాల్లోనూ పేదలందరికీ 10 లక్షలు ఇవ్వాలన్నారు. ఒక్క రాజీనామాతో ఇన్ని స్కీములు వస్తుంటే తనను గెలిపిస్తారో ఓడిస్తారో ఆలోచించుకోవాలి అన్నారు ఈటెల రాజేందర్. టిఆర్ఎస్ వాళ్లు తమ అనుచరులకు బలవంతంగా కప్పుతున్న కండువాలు ఎన్ని రోజులో ఉండవన్నారు. మంత్రిగా ఉండి ప్రశ్నించాను కాబట్టే నన్ను మంత్రి పదవి నుండి తొలగించారన్నారు ఈటెల. కరోనా  టైం లోనూ తీరికలేకుండా పని చేశానని చెప్పారు. గౌరవం లేని దగ్గర ఉండద్దనే రాజీనామా చేశారన్నారు. రోశానికి  కేరఫ్ తానేనన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: