హీరోయిన్ అంజలికి బ్యాడ్ టైమ్..!

NAGARJUNA NAKKA
అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే... అంజలిని కష్టాలు వెంటాడుతున్నాయి. తనను ప్రస్తుతం దురదృష్టం వెంటాడుతోంది. లక్ కోసం ఎంత వెంపర్లాడినా అది దూరంగానే వెళ్లిపోతోంది. దీంతో చాలా నిరుత్సాహంగా ఉంది. అంజలి ఎంత ప్రయత్నం చేసినా.. హీరోయిన్ గా బిజీ కావడం లేదు. ఐటమ్స్ సాంగ్స్ చేసినా.. సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయినా అవకాశాలు రావడంలేదు. తెలుగు, తమిళ్ లో రెండు చోట్లా ఇదే పరిస్థితి. దీంతో మళయాళీ ఇండస్ట్రీని ఫోకస్ చేస్తోంది అంజలి. మరి మాలీవుడ్ లో అయినా అంజలి బిజీ అవుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

అంజలికి చాలా రోజులుగా సరైన హిట్ లేదు. ఏడేళ్ల తర్వాత చేసిన గీతాంజలి తర్వాత అంజలికి చెప్పుకునే సక్సెస్ కూడా రాలేదు. లాస్ట్ మూవీ నిశ్శబ్ధం అయితే అంజలిని విమర్శల్లో పడేసింది. పోలీస్ ఇన్ స్పెక్టర్ క్యారెక్టర్ కు అస్సలు సెట్ కాలేదనీ.. లుక్ కూడా బాగోలేదనే కామెంట్స్ వచ్చాయి. ఈ కామెంట్స్ ఆమెను మరింత కుంగదీశాయి.

ఇదిలా ఉంటే.... అంజలిని స్టార్ హీరోలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంతకుముందు బాలకృష్ణ, రవితేజ, వెంకటేశ్ లాంటి హీరోలు ఈ బ్యూటీతో సినిమా చేసినా... ఆసక్తి చూపించడం లేదు. దీంతో సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అయింది అంజలి. ఎఫ్ 3లో ఒక కీ రోల్ పోషిస్తోంది. అలాగే రామ్ చరణ్, శంకర్ సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తోంది. అంజలికి తమిళ్ లో కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో మళయాళి ఇండస్ట్రీకి వెళ్లింది అంజలి. అక్కడ నివిన్ పాలీతో కలిసి ఒక సినిమా చేస్తోంది. మరి పెర్ఫామెన్స్ కు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే మళయాళంలో అంజలి ఎలాంటి ప్లేస్ సంపాదించుకుంటుందో చూడాలి. చూద్దాం.. ఆమె సినీకెరీర్ ముందుముందు ఎలా సాగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: