అర్జెంట్ ఆయుధాలు తెస్తున్న భారత్.. ఎందుకంటే?
ఇప్పటికే విదేశీ ఆయుధాలను కొనుగోలు చేయడంతోపాటు ఇక స్వదేశంలో ఆయుధాల తయారీకి కూడా శరవేగంగా చేపడుతుంది. ఈ క్రమంలోనే భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో బడ్జెట్ లో భారీ నిధులు సైతం కేటాయిస్తుంది. దీంతో అటు డిఆర్డిఓ కూడా ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆయుధాలను తయారు చేస్తూ భారత్ రక్షణ రంగాన్ని మరింత పటిష్టవంతంగా మారింది. ఇప్పటికే డి ఆర్ డి ఓ అభివృద్ధి చేసి ప్రయోగాల చేసి సక్సెస్ అయిన వాహనాలు భారత అమ్ములపొదిలో చేరాయి.
కాగా గత కొన్ని రోజులనుంచి పాకిస్తాన్ చైనా దేశాలు సరిహద్దుల్లో ఓవరాక్షన్ చేస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది. దీంతో శరవేగంగా ఆయుధాలను సమకూర్చుకుంటుంది భారత్. చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 700 కిలోమీటర్ల పైచిలుకు ల్యాండ్ నెట్ హూఇస్ మిస్సైల్స్ త్వరలో పరీక్షించి సైన్యంలోకి తీసుకురానుంది. 40 రోజుల్లో ఎస్-400 లను భారత్కు అందించేందుకు రష్యా కూడా ముందుకు వచ్చింది. అంతే కాదు 30 కిలోమీటర్ల పరిధిలో నిఘా కలిగిన అత్యాధునిక పరిజ్ఞానం తో ఉన్నటువంటి డ్రోన్ మేక్ ఇన్ ఇండియా లో భాగంగా పెద్ద ఎత్తున తయారుచేస్తుంది భారత్. మరోవైపు సరిహద్దు ప్రాంతాలకు వజ్రా లాంటి బలగాలను పెద్దఎత్తున మొహరిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.