2024లో టీడీపీకి కేవలం 88 సీట్లేనా... బాబు స్వయంగా పార్టీని ముంచుతారా...!
మరి ఈ లోగానే పొరపాటున టీడీపీకి బలం పెరిగిపోయి వచ్చే ఎన్నికల్లో 88 సీట్లు గెలిచేస్తుందా ? మరి ఈ 88 లెక్కలేంటి అని పొరబడేరు. అసలు విషయం తెలిస్తే మనం నోరెళ్ల బెట్టక తప్పదు. బయట జరుగుతోన్న ప్రచారం ప్రకారం వచ్చే ఎన్నికలలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి మధ్య పొత్తు ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే అప్పుడు టీడీపీ 88 సీట్ల లో మాత్రమే పోటీ చేస్తుందని ఓ ప్రచారం జరుగుతోంది.
అసలు పొత్తు అనేది ఉంటే అప్పుడు బీజేపీ - జనసేన రెండు పార్టీలు కలిసి 50 శాతం సీట్లను డిమాండ్ చేస్తాయని అంటున్నారు. ఒక వేళ చంద్రబాబు ఆ కూటమి చెప్పిన షరతులకు ఒప్పుకుంటే అది టీడీపీ ఫ్యూచర్ కు పెద్ద డేంజరే అవుతుంది. అయితే ఇప్పుడు వైసీపీ తిరుగులేని బలం తో ఉండడంతో ఆ పార్టీని టీడీపీ ఒంటరిగా ఢీ కొట్టలేదనే అంటున్నారు.
జనసేన ఇటీవల బాగా బలం పుంజుకుందని.. ఆ పార్టీతో పొత్తు ఉంటేనే తప్పా మనం అధికారంలోకి రామని చాలా మంది టీడీపీ నేతలు కూడా పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించు కుంటున్నారు. బద్వేల్ ఉప ఎన్నికల నుంచి డ్రాప్ కావడంతో ఇప్పటికిప్పుడు జనసేన-టీడీపీ దగ్గరయ్యాయని అర్థమవుతోంది. సరే ఎంత వైసీపీని ఓడించాలని అనుకున్నా చంద్రబాబు 50 శాతం సీట్లు వదులు కుంటే అది పార్టీని సర్వనాశనం చేసినట్టే అవుతుందని అంటున్నారు. మరి బాబు నిర్ణయం ఏంటో ? చూడాలి.