ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు?
ఇకపోతే ఇటీవల పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదల గండి గుట్ట వద్ద ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురైంది. ఏకంగా పక్కనే ఉన్న లోయలో పడిపోయింది బస్సు. ఇక ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లంపల్లి నుంచి హనుమకొండ బయలుదేరింది.
బస్సు నిండా ప్రయాణికులు కూడా ఉన్నారు. ఇక ప్రయాణికులందరూ వారి ప్రయాణం ఎంతో సాఫీగానే సాగిపోతోంది అని అనుకున్నారు. కానీ అంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. గాడిదల గండి గుట్ట వద్దకు రాగానే ఆర్టిసి బస్సు ఒక కారును ఢీకొట్టింది. దీంతో ఆర్టిసి బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్ళి బోల్తా కొట్టింది. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి కూడా అక్కడికక్కడే మరణించాడూ. బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తిని ఖాన్ సాయి పేటకు చెందిన వినీత్ గా గుర్తించారు పోలీసులు.