భోజనానికి ముందు.. భోజనం తర్వాత.. టాబ్లెట్ కాదు వాట్సాప్?
మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఎంతలా అంటే సోషల్ మీడియా అనేది ఒక్క క్షణం కూడా లేకుండా ఉండలేక పోతున్నారు జనాలు. గంటల తరబడి సోషల్ మీడియాలోనే కాలం గడుపుతున్నారు. ఇలా నేటి రోజుల్లో అందరిని రోజురోజుకు బానిసలుగా మార్చుకుంటున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఏది అంటే అందరూ చెప్పే పేరు వాట్సాప్. వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కావాల్సిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. దూరంగా ఉన్న వ్యక్తులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడొచ్చు. ఇలా వాట్సాప్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
కానీ ఈ సేవలను కేవలం అవసరానికి వినియోగించుకుంటే బాగుంటుంది. కానీ నేటి రోజులలో జనాలు మాత్రం అవసరం లేకపోయినా వాట్సాప్ వినియోగిస్తున్నారు. గంటల తరబడి వాట్సాప్ లో చాటింగ్ లు వీడియో కాల్ లో మీటింగ్ లు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ఇలాంటి జనాలు ఇటీవలే వాట్సాప్ సేవలు ఒక్కసారిగా ఆగిపోవడంతో అయోమయంలో పడిపోయారు. ఏదో ప్రళయం ముంచుకొస్తుంది ఏమో అన్న విధంగా కంగారు పడిపోయి ఆందోళనలో మునిగిపోయారు. అంతలా వాట్సాప్ నేటి రోజుల్లో జనాలను బానిసలుగా మార్చుకుంది. సాధారణంగా డాక్టర్లు భోజనానికి ముందు భోజనానికి తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి అని చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజులలో జనాలు మాత్రం వాట్సాప్ భోజనానికి ముందు భోజనానికి తర్వాత అన్నట్లుగా మారిపోయింది.