మా పోరు : జీవితతో తారక్ ఏమన్నారు?
మా అసోసియేషన్ తగువులు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి. సభ్యుల మధ్య అనైక్యత కారణంగా రోజుకో వివాదం తెరపైకి వ స్తోంది. దీంతో సభ్యులంతా నువ్వా నేనా అన్న రీతిలో కొట్టుకుంటున్నారు. వాగ్వాదాలు చేసుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో తగాదాలు మీడియాకు బాగా ఉపయోగపడినా, తోటి నటీనటులతో రేపటి వేళ పనిచేయాలన్న ఆలోచన కూడా లేకుండా వివాదా లపై దృష్టి సారిస్తున్నారు. పాత, కొత్త అధ్యక్షులు అన్న పేరుతో మీడియాలో రకరకాల ఆరోపణలు చేసుకుంటున్నారు. మా పరువు బజారుకు ఈడుస్తున్నారని ఒకరినొకరు తిట్టుకుంటూనే, నీతులు చెబుతున్నారు. ఈ వివాదంలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఎక్కడా తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు.
పాత వివాదాలను, లెక్కలనూ బయటకు తీసి కొట్లాటకు దిగుతున్నారు. అదేవిధంగా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎప్పటి వివాదాలో కూడా తవ్వి తీస్తున్నారు. ఇవన్నీ మా ఎన్నికల ముందే ప్రస్తావనకు రావడం అన్నది ఓ అసోసియేషన్ కు సంబంధించి ఇంతటి తలతిక్క రాజకీయాలు జరగడం ఇది తొలి సారి కాదు. గతంలోనూ ఇలాంటివే ఎన్నో ఉన్నాయి. ఆ రోజు మీడియా యాక్టివ్ గా లేదు. తాజాగా జీవిత మీడియా ముందుకు వచ్చి ఎప్పటెప్పటి గొడవలో తెరపైకి తెచ్చారు. ఇదే సందర్భంగా మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా గతంలో జరిగిన వివాదాలనూ ప్రస్తావించారు. ఇదే సందర్భంలో తారక్ ను తాను కలిశానని చెప్పారు. ఓటు విషయమై అడిగానని, తాను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నానని, తనకు ఓటు వేయాలని అడిగానని, కానీ తారక్ స్పందన వేరుగా ఉందని, తనకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే బాధ కలుగుతోందని అన్నారని మీడియా ముఖంగా చెప్పారు.