కృష్ణా జిల్లా పాలిటిక్స్‌కు వంగవీటి గుడ్ బై.. సేఫ్ ప్లేస్ దొరికేసిందా ?
గత ఎన్నికలకు ముందే రాధా టీడీపీలో చేరారు. అయితే చంద్రబాబు సీటు ఇవ్వలేదు.. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు. అయితే వచ్చే ఎన్నికలలో రాధాను ఖచ్చితంగా పోటీ చేయిస్తారని అంటున్నారు. రాధా కు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నది ఇష్టం. గత ఎన్నికలలో జగన్ ఆ సీటును మల్లాది విష్ణుకు ఇచ్చారనే రాధా టీడీపీలోకి వచ్చేశారు.
అయితే అక్కడ టీడీపీ తరపున రాధాకు అవకాశాలు కష్టమే. అక్కడ టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు స్ట్రాంగ్ గా ఉన్నారు. పైగా ఆయన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండడంతో పాటు గత ఎన్నికల లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే వంగవీటి బ్రాండ్ తెలుగు గడ్డపై బలంగా ఉంది. అందుకే వచ్చే ఎన్నికలలో రాధాను కృష్ణా జిల్లా నుంచే కాకుండా కాపు సామాజికవర్గం బలంగా ఉన్న ఎక్కడ నుంచి అయినా పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
అయితే ఈ సారి ఆయన్ను తూర్పు గోదావరి జిల్లా నుంచి బరిలో దింపుతారని అంటున్నారు. ప్రస్తుతం బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్న రాజమండ్రి రూరల్ బరిలో రాధా దిగడం ఖాయమైందని టాక్ ? అక్కడ కాపు వర్గం బలంగా ఉంది. పైగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని చెపుతోన్న బుచ్చయ్యే అక్కడ నుంచి వంగవీటిని పోటీకి పెట్టాలని సూచన చేసినట్టు టాక్ ?