తీన్మార్ మల్లన్న బీజేపీలోకి.. కానీ?

praveen
తీన్మార్ మల్లన్న.. ఒకప్పుడు  ఒక టీవీ ఛానెల్లో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ద్వారా గుర్తింపు సంపాదించిన ఈయన ఇక ఇటీవల కాలంలో ప్రత్యేకమైన ఛానల్ ప్రారంభించి ప్రభుత్వాన్ని ఏకిపారేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి కేసీఆర్ ప్రభుత్వం తీరును ఎండగడుతూ సంచలన విమర్శలు చేస్తూ ఎంతో దూకుడు గానే ముందుకుసాగారు తీన్మార్ మల్లన్న. ఇక రాజకీయాల్లో కూడా ప్రవేశించి పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. అయితే ఏ పార్టీలో చేరకుండా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.

 ప్రజల సమస్యలను ప్రస్తావించడం లో.. ప్రభుత్వం తీరును ఎండగట్టడంలో తీన్మార్ మల్లన్న పాత్ర ఎంతో కీలకంగా మారిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో అటు ప్రభుత్వం తీన్మార్ మల్లన్న పై వరుసగా కేసులు పెట్టడం జైలుకు పంపించడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటీవలే తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అంచలంచలుగా ఎదుగుతున్న బీజేపీ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.  ఇక ఈ నిర్ణయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తీన్మార్ మల్లన్న కు బిజెపిలో ప్రస్థానం ఎలా సాగిపోతుంది అనే దానిపై కూడా విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న దళితులు బీసీలు కూడా తీన్మార్ మల్లన్న వెనకే ఉన్నారని..  తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో లేకపోవడంతో ఇన్ని రోజుల వరకు మద్దతు ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.  అయితే తీన్మార్ మల్లన్న వెనక ఉన్న దళిత సంఘాలు బీసీ సంఘాలు కూడా బిజెపికి మాత్రం అనుకూలంగా లేవని ఇలాంటి సమయంలో ఇక తీన్మార్ మల్లన్న బీజేపీలోకి వెళితే ఇప్పటివరకు తీన్మార్ మల్లన్న కు మద్దతుగా నిలిచిన వారందరూ కూడా తోడుగా ఉంటారా లేదా అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: