పాక్ లో మహిళకు ఉరిశిక్ష.. ఎందుకో తెలుసా?

praveen
దేవుడు మీద జనాల్లో ఉన్న భక్తిని ఆసరాగా చేసుకుని తామే దేవుళ్ళం అంటూ చెప్పుకునే దొంగ బాబాలు నేటి రోజుల్లో ఎక్కువై పోతున్నారు  ఇక ప్రజలు మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుంటూ భారీగా డబ్బులు గుంజుతున్నారు  అంతేకాదు నోట్లోంచి శివ లింగాలు తీయడం..  ఇక ఎన్నో జబ్బులు నయం చేయడం లాంటి జిమ్మిక్కులు చేసి ఎంతో మంది ప్రజలను నమ్మిస్తున్నారు. ఇలా భారత్లో ఎన్నో సార్లు జరిగాయి అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ఇక జనాలు అందరిని ఎన్నో జిమ్మిక్కు లతో నమ్మించి మేమే దేవుళ్ళం అంటూ జనాలను బురిడీ కొట్టించే వారు ఎంతోమంది.

 ఇలా నేటి రోజుల్లో కూడా భారత్ లో ఎంతో మంది బురిడీ బాబాల యవ్వారం అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంటుంది. కానీ అటు భారత్ దాయాది దేశమైన పాకిస్తాన్లో మాత్రం ఇలాంటివి చట్ట ప్రకారం అస్సలు సహించరు.  దేవుడు పేరు వాడుకుని డబ్బులు సంపాదించే వాళ్ళని కఠిన శిక్షలు విధిస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే ఇటీవల ఒక మహిళకు ఏకంగా దేవుడిని దూషించింది అంటూ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడం సంచలనం గా మారి పోయింది.

 ముస్లింల అందరికీ తర్వాతి ప్రవక్త నేనే అంటూ ఓ మహిళా ప్రచారం చేసు కోవడం మొదలు పెట్టింది.  ఈ ప్రచారం కాస్త దేశ వ్యాప్తం గా సంచలనం మారింది. ఎంతో మంది ముస్లింలు ఈ మహిళ పై కేసు పెట్టారు. ఇక ఈ విషయానికి సంబంధించి 2013లో కేసు నమోదు కాగా.. కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఇటీవలే ఈ కేసు పై విచారణ చేపట్టిన కోర్టు ఏకంగా ఆ మహిళకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఇలా ఇప్పటివరకు నేనే దేవున్ని అంటూ చెప్పుకున్న 1480 మందికి అక్కడి కోర్టు ఉరి శిక్ష విధించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: