ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తోన్న జ‌గ‌న్‌...!

VUYYURU SUBHASH
ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టాక పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. ప్రతి రోజు ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా ఉంటున్నాయి. ఇక  ఏపీ మంత్రివర్గంలో మార్పులపై పూర్తిగా క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకు ఆ మంత్రి కంటిన్యూ అవుతారు...ఈ మంత్రి బయటకొచ్చేస్తారు అని చర్చలు నడిచాయి గానీ....ఈ సారి మంత్రివర్గం నుంచి అందరూ బయటకొచ్చేస్తారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. 100 శాతం మంత్రివర్గంలో మార్పులు చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని మంత్రి చెప్పుకొచ్చారు. జగనే ఈ విషయం స్వయంగా తనకు చెప్పారని బాలినేని అన్నారు.

అంటే ఈ సారి మంత్రులందరూ ఔట్ అవ్వడం ఖాయమని తేలిపోయింది. ఇక వారి ప్లేస్‌లో కొత్త మంత్రులు రావడం కూడా పక్కా అని అర్ధమవుతుంది. కాకపోతే అందర్నీ పక్కనబెట్టేస్తారని చెబుతున్నారు బాగానే ఉంది గానీ, గతేడాదే మంత్రివర్గంలోకి వచ్చిన ఇద్దరు కొత్త మంత్రులు కూడా సైడ్ అవ్వాల్సిన పరిస్తితి ఉందా? లేదా? అనేది క్లారిటీ రావడం లేదు.

ఎందుకంటే మండలి రద్దు నేపథ్యంలో పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. జగన్ వారికి రాజ్యసభ పదవులు ఇచ్చారు. ఇక వారి స్థానంలో సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్‌లని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గతేడాది జులైలో ఈ ఇద్దరు జగన్ మంత్రివర్గంలోకి వచ్చారు. అంటే వీరి క్యాబినెట్‌లోకి వచ్చి ఏడాది దాటింది.

అయితే ఈ ఏడాది చివరన గానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ జగన్ మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉంది. అంటే కరెక్ట్‌గా వీరు ఏడాదిన్నర మంత్రులుగా పనిచేసినట్లు అవుతుంది.  అయితే మిగిలిన వారు రెండేళ్లన్నర పనిచేసినట్లు అవుతుంది. అలాంటప్పుడు జగన్ వీరిని అప్పుడే తప్పించేస్తారా? లేక కంటిన్యూ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. కానీ బాలినేని చెప్పినట్లుగా చూసుకుంటే ఈ ఇద్దరు మంత్రులు కూడా దుకాణం సర్దేసుకోవచ్చని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: