పవన్‌తో బాబు కలిస్తే ముందు మునిగేది ఆ మంత్రే...!
ఇలా రచ్చ జరుగుతున్న సమయంలోనే పవన్ వెనుక చంద్రబాబు ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మళ్ళీ ఈ ఇద్దరు నాయకులు కలిసి పనిచేయనున్నారని వైసీపీ విమర్శిస్తుంది. అయితే పవన్-చంద్రబాబులు కలిసి పనిచేస్తే చాలామంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు చెక్ పడిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టిడిపి-జనసేనలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అయింది.
ఇక ఆ రెండు పార్టీలు కలిసి బరిలో ఉంటే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు చెక్ పడటం ఖాయం. మొదటగా పవన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న మంత్రి పేర్ని నానికే చెక్ పడుతుంది. గత ఎన్నికల్లో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో నానికి వచ్చిన మెజారిటీ కేవలం 5,932 ఓట్లు మాత్రమే. అంటే టిడిపి నేత కొల్లు రవీంద్ర ఆ మెజారిటీతో గెలిచారు. మచిలీప ట్నం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. గత ఎన్నికలలో ఇక్కడ జనసేన గట్టిగా ప్రభావం చూపింది. అయితే పేర్ని చాలా స్వల్ప మెజార్టీ తో బయ ట పడ్డారు.
గ త ఎన్నికల లో ఇక్కడ జనసేనకు పడిన ఓట్లు వచ్చి 18,807 ఓట్లు. ఇక దీని బట్టి చూసుకుంటే రెండు పార్టీలు కలిస్తే పేర్ని పరిస్తితి ఏం అయ్యేదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సింగిల్‌గా జనసేన....పేర్నికి చెక్ పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ టిడిపి నేత కొల్లు కూడా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కాబట్టి టిడిపితో జనసేన పొత్తు పెట్టుకుంటే పేర్నికి గెలుపు దక్కడం కష్టమే.