నేడే హుజూరాబాద్ నోటిఫికేషన్.. కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్?

Veldandi Saikiran
హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక కు కౌంట్ డౌన్ షురూ అయింది. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా నేడు విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 8 వ తారీకు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు ఎన్నికల అధికారులు. హుజరాబాద్ నియోజకవర్గం లోని ఆర్డీవో కార్యాలయంలో... ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను స్వీకరించనున్నారు ఎన్నికల అధికారులు. 


అలాగే కరోనా నేపథ్యంలో... ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకి కేవలం ఐదుగురు మాత్రమే వెళ్లాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు కూడా లెక్కించనున్నది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం ప్రతి అభ్యర్థి ఏకంగా 28 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చును. అలాగే రాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి రెండు రోజుల వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని ప్రకటించింది ఎన్నికల కమిషన్.  ఇక ఇది ఇలా ఉండగా... హుజూరాబాద్ నియోజకవర్గం లో ముఖ్యంగా కాంగ్రెస్, టిఆర్ఎస్ మరియు భారతీయ జనతా పార్టీ ల మధ్య మాత్రమే పోటీ నెలకొనే అవకాశం ఉంది.  


అయితే ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగా.. బిజెపి పార్టీ నుంచి బరిలో ఉండనున్నారు ఈటల రాజేందర్. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదాని పై... సందిగ్ధత నెలకొంది. అసలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా వస్తారనే దానిపై ఆ పార్టీ నేతల్లోనే క్లారిటీ లేకుండా పోయింది. మొదట్లో పొన్నం ప్రభాకర్... ఇప్పుడు కొండా సురేఖ అని ప్రచారం సాగుతోంది. అటు కొండా సురేఖ కూడా పోటీ చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కొండా సురేఖ పోటీ చేయని యెడల... రెడ్డి సామాజికవర్గం నుంచి అభ్యర్థిని తీసుకువచ్చే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: