ఏపీలో ఇప్పుడు ఎన్నికలొస్తే... టీడీపీ సర్వేలో షాకింగ్ రిజల్ట్ ?
ఇదిలా ఉంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ? ఉంటుంది అన్న దానిపై టిడిపి వాళ్ళు లోకేష్ టీం అంతర్గతంగా ఒక సర్వే చేయించుకున్న తెలుస్తోంది. ఈ సర్వేలో టీడీపీ కాస్త పుంజుకున్న వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ ఎవరితోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తే ఏపీలో ఉన్న మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను వైసీపీ 19 చోట్ల.. టీడీపీ ఆరు చోట్ల గెలుస్తుందని తేలిందట. ఈ సర్వే కేవలం లోక్ సభ స్థానాలను బేస్ చేసుకుని మాత్రమే జరిగింది.
ఇక టీడీపీ + జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఈ రెండు పార్టీల కూటమి మొత్తం 25 ఎంపీ సీట్ల కు గాను 14 చోట్ల విజయం సాధిస్తుందని తేలిందట. ఈ రెండు పార్టీల పొత్తు వైసీపీకి షాక్ ఇస్తుందని సర్వే చెపుతోంది. ఇక ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేసినా కూడా వైసీపీకి ఏకంగా 11 ఎంపీ సీట్లు వస్తున్నాయి. సీమ, నెల్లూరు , ప్రకాశం జిల్లాలలో వైసీపీ చాలా బలంగా ఉందని.. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వైసీపీని ఈ రెండు పార్టీ లు కలిసినా కూడా ఎదిరించే పరిస్థితి లేదని సర్వేలో తేలినట్టు ఆ పార్టీ వాళ్లే చెపుతున్నారు. మరి టీడీపీ సర్వే పై వైసీపీ నేతల నుంచి ఎలాం టి రిటాక్ట్ ఉంటుందో ? చూడాలి.