ఆ ఏపీ మంత్రి కోసం రాష్ట్రం అంతా అక్కడకు క్యూ కట్టిందే..!
ఎలా అంటే.. ప్రస్తుతం పర్యాటక శాఖ చూస్తున్న అవంతి.. ఏటా నిర్వహించే `టూరిజం డే`కు ఆయనే అతిథి, ఆయన నిర్వాహకు డు.అంతేకాదు.. దీనిని ఎలా చేసినా ఎవరూ అడగరట. ఇదొక్కటే కాదు.. తన సొంత ఇలాకా విశాఖలోనే ఆయన గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సోమవారం నిర్వహించే కార్యక్రమం రెండోది. అయితే.. భారత్ బంద్ నేపథ్యంలో దీనిని తూతూ మంత్రంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసినా.. ఖర్చులు మాత్రం తగ్గాల్సిన అవసరం లేదని.. మంత్రిగారు చెప్పేశారని అంటున్నారు. దీనిని చూసి అధికారులు కూడానివ్వెర పోతున్నారు. వాస్తవానికి పర్యాటక దినోత్సవం అంటే.. గత చంద్రబాబు ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు నిర్వహించేది. అసలు దీని లక్ష్యమే ఇది.
కానీ, మంత్రి అవంతి పగ్గాలు చేపట్టిన తర్వాత.. మాత్రం దీని విధానం మారిపోయింది. ఆయనే అన్నీ అయి.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి కూడా పచ్చజెండా ఊపారని అవంతి వర్గం చెబుతోంది. నిజానికి ఉత్తరాంధ్రలో తనదే పైచేయి కావాలని.. పోనీ.. విశాఖలో అయినా..తన హవా నడవాలని అవంతి కోరుకున్నారు. కానీ, ఇది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈ రూపంలో అంటే.. టూరిజం డేను మాత్రం పూర్తిగా తన కనుసన్నల్లో నిర్వహించుకునేలా.. ఆయన వ్యూహాత్మకంగా అనుమతులు తెచ్చుకున్నారని అంటున్నారు. మొత్తానికి ఏటా.. ఇక్కడే కార్యక్రమం నిర్వహిస్తూ.. అవంతి ముచ్చట తీర్చుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం పర్యాటక రంగం ఏపీలో ఇబ్బందుల్లో ఉంది. రానురాను.. కరోనా దెబ్బతో పర్యాటకులు తగ్గిపోవడం.. ప్రభుత్వం మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. వంటివి మంత్రిని వేధిస్తున్నా.. టూరిజం డేను తన స్వంతానికి వదిలేయడం మాత్రం ఆయనకు హ్యాపీగా ఉందని అంటున్నారు పరిశీలకులు. సో.. ఎవరికీ దక్కని ఛాన్స్ మంత్రి అవంతి పొందారని వైసీపీలోనూ గుసగుస వినిపిస్తోంది.