జగన్ ఇలాకా : బడి తగువు! బడితె పూజ..!
స్థానిక ఎన్నికల తరువాత ఎవ్వరూ అంతగా ఊహించని స్థాయిలో వైసీపీ వర్గాలు బడి ఎన్నికల్లో కొట్లాటకు దిగాయి. అసలు పాఠ శాలలకు సంబంధించి ఎన్నికల రాజకీయా లు ఎందుకు ? ఓ మంచి పాఠశాలను రూపొందించి వాటి నిర్వహణకు స్థానిక నాయక త్వం కృషి చేయాలే కానీ ఇటువంటి రాజకీయాలు చేసి ఏం సాధిస్తారని? పాఠశాలపై పట్టు సాధించి వీళ్లంతా ఏం లబ్ధి పొందాలని? ఇవేమన్నా ఎంపీ ఎన్నికలా? ఎమ్మెల్యే ఎన్నికలా? అసలు ఓ బడికి వచ్చేనిధులెన్ని? ఓ బడి నిర్వహణకు సాయపడే మను షులు ఎందరని? మంచి బడులు లేక నిన్నటి దాకా తగాదాలే తగాదాలు నడిచాయి.
ఇప్పుడు నాడు - నేడు కార్యక్రమం పుణాన కా స్త క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం వచ్చింది. అలా అని ఇదేమంత పూర్తి స్థాయిలో నోచుకున్న పరిష్కారం కా కపోయినా మొదటి విడతలో ఎంపికచేసిన పాఠశాలలలో వసతులు అనుకున్న విధంగానే మెరుగయ్యాయి అన్నది వాస్తవం. ఈ విషయమై అంతా వైసీపీని మెచ్చుకుం టున్నారు. ఇదే హుందాతనం పేరెంట్ మానిటరింగ్ కమిటీ ఎన్నికల్లో ఎందుకు చాటుకో లేకపోయింది.? గతంలో ఎన్నడూ లేని విధంగా బడిలో ఈ రాజకీయాలేంటి? తలలు బద్దలు కొట్టుకునేంత, రక్తపాతం సృష్టించేంత స్థాయిలో జరగాల్సిన లేదా నిర్వహించాల్సిన ఎన్నికలా ఇవి?
పేరెంట్ మానిటరింగ్ కమిటీ పేరిట నిన్నటి వేళ రాష్ట్రం అంతటా ఎన్నికలు జరిగాయి. కొన్ని చోట్ల ప్రశాంతంగానూ, ఇంకొన్ని చోట్ల వి ధ్వంసాలకు ఆనవాలుగానూ జరిగాయి. అవును! శ్రీకాకుళం మొదలుకుని కడప వరకూ తగాదాలే తగాదాలు. శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలంలో వైసీపీ, బీజేపీ వర్గాలు కొట్లాడుకున్నాయి. దీంతో ఇక్కడ ఎ న్నికను వాయిదా వేశారు. విజయనగ రంలో పె ద్దగా తగాదాలు లేవని ప్రధాన మీడియా చెబుతోంది. విశాఖ, మునగపాక గణపర్తి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల కమి టీల ఎన్నిక ల్లో ఇరువర్గాలూ రాళ్లతో కొట్టుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో ఓ గ్రామస్థుడు తీవ్రంగా గాయపడ్డా డు. కడప జిల్లా లో కమలాపురం మండలం పెద్ద చెప్పలి ఉన్నత పాఠశాలలో చైర్మన్ పదవికి వైసీపీ వర్గాలు రెండుగా విడిపోయి కొట్టుకున్నాయని ప్రధాన మీడియా చెబుతోంది.