పేటలో అక్రమాలు...టార్గెట్ రజిని...

M N Amaleswara rao
ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టి‌డి‌పి సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దూకుడు పెంచారు. చిలకలూరిపేటలో వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ అక్రమాలు చేస్తుందంటూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఓడిపోయాక అంత దూకుడుగా పార్టీలో పనిచేయలేదు. ఊహించని విధంగా విడదల రజిని చేతిలో పుల్లారావు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజిని దూకుడుగా రాజకీయం చేస్తున్నారు.
పేటలో తన ఆధిక్యాన్ని పెంచుకునే దిశగా పనిచేస్తూ వెళుతున్నారు. ఎక్కడకక్కడ టి‌డి‌పి శ్రేణులకు చెక్ పెడుతూ...వైసీపీ లీడింగ్ పెంచుతున్నారు. అలాగే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్ర స్థాయిలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అయితే అలా జూనియర్ ఎమ్మెల్యే దూకుడు ప్రదర్శిస్తుంటే సీనియర్ నేతగా ఉన్న పుల్లారావు మాత్రం సైలెంట్‌గానే రాజకీయం చేశారు. పంచాయితీ, మున్సిపాలిటీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో రజిని పైచేయి సాధించిన కూడా పుల్లారావు పెద్దగా స్పందించ లేదు.
కానీ ఎన్నికలు అన్నీ అయిపోయాక పుల్లారావు రాజకీయం స్టార్ట్ చేశారు. పేటలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో మైనింగ్ కోసం దళితుల భూములు దోపిడికి గురయ్యాయని,  యడవల్లి దళిత, గిరిజన రైతులను సి‌ఎం  మోసం చేశారని ఫైర్ అవుతున్నారు.
అయితే జగన్ అధికారంలోకి రాగానే పట్టాలు ఇస్తానని దళితులకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఏపీఏండీసీ పేరుతో వారి భూములనే లాక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు. యడవల్లి సొసైటీ భూముల రైతులకు న్యాయం చేయాలని, గ్రానైట్‌లో దళిత రైతులకు భాగస్వామ్యం కల్పించాలని, అలా కుదరని పక్షంలో ఎకరాకు కోటి పరిహారం చెల్లించాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు.
అంటే పరోక్షంగా ఎమ్మెల్యేని కూడా టార్గెట్ చేసుకుని పుల్లారావు ఆరోపణలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ ఇచ్చిన హామీని రజిని అమలు చేయలేకపోయారనే విధంగా రాజకీయం చేస్తున్నారు. మొత్తానికైతే పేటలో రాజకీయాన్ని పుల్లారావు బాగా హీటెక్కించేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: