డ్రగ్స్ కేసు.. కీలకంగా మారిన ఈడి తదుపరి దర్యాప్తు !

Veldandi Saikiran
డ్రగ్స్ కేస్ లో దర్యాప్తు ముమ్మరం చేయనున్న ఈడి .. డ్రగ్స్ కేస్ ను  మనీ లాండరింగ్ కోణం లో దర్యాప్తు చేసింది.   విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి చేసిన కెల్విన్ బ్యాంక్ ఖాతాల తో తారల స్టేట్ మెంట్ లను పరిశీలించిన ఈడి..    పిఎంఎల్ఏ  కింద  12 మంది తారలకు నోటీస్  జారీ చేశారు ఈడి అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ ముట్టవరపు.  ఎక్సైజ్ శాఖ విచారణ లో తరుణ్, పూరి లకు క్లీన్ చిట్ ఇవ్వగా..  ఎక్సైజ్ విచారణ తో సంబందం లేకుండా దర్యాప్తు చేస్తుంది ఈడి.  ఎఫ్ కేఫ్ లాంజ్ కేంద్రంగా జరిగిన డ్రగ్స్ పార్టీ కి మత్తు పదార్థాల సరఫరా పై కీలక ఆధారాలు సేకరించింది ఈడి.. 

టాలీవుడ్ స్టార్స్ పార్టీ కి అడ్డాగా ఎఫ్ కేఫ్ లాంజ్ మారగా..  2017 లో జరిగిన పార్టీ లకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేశాడని గుర్తించారు ఈడీ అధికారులు.  కెల్విన్ ను 2017 లో అరెస్ట్ చేసే సమయంలో ఇంట్లో ఉన్న ల్యాప్ టాప్ , హార్డ్ డిస్క్ లలో డేటా మొత్తం erase చేశాడు కెల్విన్.  అంతే కాదు సినీ తారలకు డ్రగ్స్ ఇచ్చినట్టు ఎక్సైజ్ కు తెలిపాడు కెల్విన్.   2017 లో 13 మంది సెలబ్రేటిలను విచారించిన ఎక్సైజ్..  ఛార్జ్ షీట్ లో ఒక్క సినీ తార పేరును నమోదు చేయలేదు.  

ఇక అటు  ఎక్సైజ్ టాలీవుడ్ డ్రగ్స్ కేస్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ తో దర్యాప్తు చేయాలని పలువురు హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.  ఎక్సైజ్ ఎఫ్ ఐ ఆర్ ను ఆధారంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన ఈడి.. ఎక్సైజ్ నుండి కేస్ కు సంబందించి కొన్ని వివరాలు సేకరించింది. తాము అడిగిన కొన్ని వివరాలను ఎక్సైజ్ ఇవ్వలేదని కోర్ట్ కు తెలిపింది ఈడి. ఇక ఈడి తదుపరి దర్యాప్తు కీలకం మారనుంది.  ఎక్సైజ్ మాదిరిగా కేసును నీరుగారుస్తోంద లేక ముందుకు తీసుకెల్తుందా? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.  ఎక్సైజ్ శాఖ పరిగణించినట్టు సినీ ప్రముఖులు బాధితులా??  లేదా అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించి తారలను నిందితులుగా చేరుస్తుందా?? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: