బండి సంజయ్ కి వైట్ ఛాలెంజ్ విసిరిన కొండా విశ్వేశ్వరరెడ్డి !

Veldandi Saikiran
తెలంగాణ  కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్  ఇవాళ స్వీకరించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇందులో భాగంగానే నేడు గన్ పార్క్ కు వచ్చారు ఈ మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వైట్ ఛాలెంజ్ అనేది సమాజానికి మంచిదని..  రేవంత్ రెడ్డి .. విసిరిన  ఛాలెంజ్ స్వీకరించి వస్తే..  కేటీఆర్ తన స్థాయి మరింత పెరిగేదన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మా స్థాయి వేరు అని రాజకీయ నేతలు మాట్లాడొద్దని..  పెద్ద రాజకీయ నేతలు - చిన్న వ్యక్తుల దగ్గరకు వెళ్లి మాట్లాడుతారని చురకలు అంటించారు కొండా విశ్వేశ్వరరెడ్డి.  

సింగరేణి ఘటన డ్రగ్స్ వల్లనే అయిందని.. ఎన్నికల్లో నిలబడే ప్రతి లీడర్ కు డ్రగ్ టెస్ట్ తీసుకోవాలని స్పష్టం చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి.  డ్రగ్ టెస్ట్ తీసుకున్న తరువాతే ఎన్నికల్లో నిలబడే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించాలని వెల్లడించారు.  మంత్రి కేటీఆర్..  రాహుల్ గాంధీ గురించి తొందరపాటు లో మాట్లాడుతున్నారని.. ఈ ఇస్యుకు రాహుల్ కు సంబంధం లేదని పేర్కొన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి.  డ్రగ్ విషయం రాష్ట్రానికి చెందిన సమస్య అని పేర్కొన్నారు.  బండి సంజయ్- ప్రవీణ్ కుమార్ కు వైట్ ఛాలెంజ్ విసురుతున్నానని వెల్లడించారు కొండా విశ్వేశ్వరరెడ్డి.  

వైట్ ఛాలెంజ్ స్వీకరించి యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఇక అటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి విసిరిన  వైట్ ఛాలెంజ్ పై బండి సంజయ్ స్పందించారు.  కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వైట్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు బండి సంజయ్.  "నాకు ఎలాంటి అలవాట్లు లేవు.. అక్టోబర్ 2తో నా పాదయాత్ర పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఈ వైట్ ఛాలెంజ్ తో పేద ప్రజలకు ఎం సంభందం? బాగా బలిసినోడు బలుపు ఎక్కినోడు డ్రగ్స్ తీసుకుంటారు.  బండి సంజయ్  ఏ ఛాలెంజ్ కి అయినా వెనక్కి పోడు. " అంటూ పేర్కొన్నారు బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: