కష్టాల సుడిగుండంలో శంకర్..!

NAGARJUNA NAKKA
శంకర్‌ 'టు పాయింట్ ఓ' డిజాస్టర్ నుంచిబయటపడేందుకు 'ఇండియన్2' స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. పైగా లైకా ప్రొడక్షన్స్‌ కోర్టు కేసుల వరకు వెళ్లింది. 'ఇండియన్2' పూర్తయ్యే వరకు శంకర్‌ మరో సినిమా చేయకుండా ఆర్డర్స్‌ ఇవ్వండని ఫిర్యాదు చేసింది.
లైకా ప్రొడక్షన్స్‌ గొడవతో 'ఇండియన్2'ని పక్కనపెట్టేసి, కొత్తగా రెండు సినిమాలు అనౌన్స్‌ చేశాడు శంకర్. రామ్‌ చరణ్‌తో ఒక పాన్ ఇండియన్ మూవీ లాంచ్ చేశాడు. అలాగే బాలీవుడ్‌ స్టార్ రణ్‌వీర్‌ సింగ్‌తో 'అన్నియన్' రీమేక్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ ప్రకటన రావడం ఆలస్యం ఆస్కార్ రవిచంద్రన్ ఇష్యూ మొదలైంది.
శంకర్‌ దర్శకత్వంలో 'అన్నియన్' సినిమా నిర్మించాడు రవిచంద్రన్‌. ఈమూవీ తెలుగులో 'అపరిచితుడు'గా రీమేక్‌ అయ్యింది. ఇక శంకర్‌ 'అన్నియన్' హిందీ రీమేక్ అనౌన్స్‌ చెయ్యగానే, ఈ కథ నాదని బహింగ లేఖ రాశాడు అస్కార్ రవిచంద్రన్. అయినా శంకర్‌ వెనక్కి తగ్గలేదు. దీంతో రవిచంద్రన్  మరొక అడుగుముందుకేసి హిందీ, ఇంగ్లీష్‌లో 'అన్నియన్' రీమేక్ చేస్తానని ప్రకటించాడు.
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి ఫేట్‌ ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. బ్లాక్‌బస్టర్ వచ్చినప్పుడు మావాడు.. మావాడు.. అని వెంటతిరిగినోళ్లు ఫ్లాప్‌ రాగానే పక్కకెళ్లిపోతారు. వాళ్ల గురించి ఆలోచించడం కూడా మానేస్తారు. టాప్‌ డైరెక్టర్‌ని కూడా పక్కనపెట్టేస్తారు. ఇప్పుడు శంకర్ పరిస్థితి ఇలాగే మారింది అంటున్నారు.
శంకర్‌ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు ఈ డైరెక్టర్‌తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. 'రోబో' తర్వాత వందలకోట్లు పెట్టుబడి పెట్టడానికి వెనకాడలేదు. కానీ భారీ సినిమాలు 'ఐ, టు పాయింట్ ఓ' బోల్తాపడ్డాక శంకర్‌తో గొడవలకు దిగుతున్నారు నిర్మాతలు. నిర్మాతలు ఎప్పుడూ టాప్‌ డైరెక్టర్‌తో ఫ్రెండ్‌షిప్‌ చెయ్యడానికే చూస్తారు. ఒక సినిమా తీసి పెడితే భారీ లాభాలు అందుకోవచ్చని అతని వెంటే తిరుగుతుంటారు. అయితే శంకర్‌ భారీగా ఖర్చుపెట్టిస్తున్నాడని, లాభాలు మాత్రం అందివ్వట్లేదనే ఒక నెగటివ్ ఇమేజ్‌ మొదలైంది. శంకర్‌తో సినిమా అంటే లాటరీ లాంటిదనే కామెంట్స్‌ వస్తున్నాయి. దీంతో చాలామంది నిర్మాతలు శంకర్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: