ఓవర్ టు జగన్ : భావోద్వేగాలు చట్టాలు కావు సర్?

RATNA KISHORE
భావోద్వేగాలు వేరు..చ‌ట్టాలు వేరు. సీఆర్పీసీని మార్చేస్తా, ఐపీసీని మార్చేస్తా అంటూ ఎవ‌రికి వారు అనుకోవ‌డం పెద్ద ఇబ్బందేం కాదు కానీ అవి అమ‌లుకు నోచుకోవు అన్న విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తించ‌డం లేదు. గుర్తించినా వాస్త‌వాల‌ను అంగీక‌రించ‌డంలేదు. ఈ కార‌ణంగానో మ‌రే ఇత‌ర కార‌ణంగానో దిశ యాక్ట్ అన్న‌ది యాక్ట్ కాదు అదొక యాప్ మాత్ర‌మే అన్న‌ది తేలిపోయింది.

ఆంధ్రావనిలో మహిళల రక్షణకు, భద్రతకు తాము అండగా ఉంటామని చెబుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం విమర్శల కు నోచుకుంటుందే తప్ప అమలుకు నోచుకోదు. ఎందుకంటే సీఆర్పీసీ, ఐపీసీలను మార్పు చేయడం అంత సులువు కాదనే నిపు ణులు చెబుతున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం దిశ ద్వారా పలు శిక్షలు వేశామని, పలువురికి న్యాయ దండన విధించామని చెప్పడ మే ఆశ్చర్యకరం.
ఏపీలో దిశా చట్టం అమలుపై ఏవో చెబుతున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. దిశ చట్టం తీరు ఎలా ఉన్నా అది అమలు ఎలా ఉన్నా ముందు అసలు ఈ చట్టంపై కేంద్రానికి ఉన్న స్పష్టత ఎంత? రాష్ట్రానికి ఉన్న స్పష్టత ఎంత అన్నది తేలాలి. ఇవేవీ తేలకుండా చట్టం తెచ్చేశాం. ఇదిగో మీ వాకిటకే న్యాయం..మీకే ఈ చట్టం అని చెప్పడం సబబు కాదు. "ముఖ్యంగా భావోద్వేగాల ఆధారంగా తయారు చేసే ఏ చట్టం కూడా పార్లమెంట్ ఆమోదాలకు నోచుకోదు. చట్టానికి భావోద్వేగం కాదు కావాల్సింది సాధ్యత."ఇదీ న్యాయ నిపుణులు చెబుతున్న మాట. అందుకే దిశ చట్టం రూపం దాల్చలేదు. దాల్చదు కూడా! ఈ చట్టంలో అనేక చిక్కులున్నాయి. వాటిని పరిష్క రించాలి.
నేరం జరిగిన వెంటనే వారం రోజుల్లో దర్యాప్తు, 21 రోజుల్లో శిక్ష అన్నది కుదరని పని అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నేరం జరిగిన వారంలోనే దర్యాప్తు సంస్థలు ఛార్జిషీటు దాఖలు చేయడం అన్నది జరగని పని అని కూడా వారు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అసలు ఐపీసీలో మార్పులు పార్లమెంట్ ఆమోదం లేనిదే సాధ్యమా? అలాంటప్పుడు కొత్త చట్టాలు ఎలా అమలు అవుతాయి? ఉన్న సెక్షన్లలో శిక్షల్ని పెంచడం, అదనపు సెక్షన్లు జోడించడం అన్నవి కూడా ఇప్పటికిప్పుడు ఆమోదానికి పొందేవే కావని నిపుణుల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: