జగన్ అండ్ జోగి : మంత్రి పదవి ఇవ్వకపోతే?

RATNA KISHORE
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. అంతెందుకు జీవితంలో కూడా ఏదీ శాశ్వతం కాదు. కానివాటిపై మమకారం చూపించడంలో అర్థం లేదు. ఎందుకనో మన నాయకులు అతి ప్రేమ కొన్నింటిపై చూపించి కోరి కయ్యాలు పెంచుకుంటున్నారు. ఈ కోవలో ఈ తోవలో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేశ్ చేరిపోయారు. గతంలో ఇదే విధంగా స్వామిభక్తిలో ఆరితేరిన కొందరు జర్నలిస్టులు కూడా తరువాత ఆశాభంగం పొందారు. ఎందుకొచ్చిన గొడవ ఎవరి పరిధిలో వారు రాజకీయాలు చెయొచ్చుగా?


మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో వివాదాలు రేగుతున్నాయి. ఆయన స్థాయి మరిచి మరీ! సీఎం స్థాయి వ్యక్తిపై అలా మాట్లాడడం తగని పని. ఇది అంతా ఒప్పుకుంటారు. ఆయన మాటలు అస్సలు రాయనివ్వని భాషలో ఉన్నాయి. ఇది కూడా నిజం. అయ్యన్న ఘటన నేపథ్యంలో జోగి రమేశ్ కనబరిచిన అత్యుత్సాహమే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.వైసీపీ సీనియర్లు అంతగా పట్టించుకోని కారణంగా సీన్ లోకి జోగి వచ్చారా? సీఎం ఆదేశాల మేరకే ఆయన మాజీ మంత్రి ఇంటిపై దాడికి వెళ్లారా ? అన్న ప్రశ్నలు కొందరు టీడీపీ నాయకుల నుంచి వస్తున్నాయి. వాటి తీరు ఎలా ఉన్నా ఇంతటి స్వామిభక్తి గతంలో చాలా మంది వైసీపీ నాయకులు  కనబర్చినప్పటికీ తరువాత కాలంలో వారికి జగన్ నుంచి దక్కిన సానుభూతి కానీ మద్దతు కానీ ఏమీ లేదని కొందరు అంటున్నారు. ఇదే రీతిన జోగి రమేశ్ కు పదవి దక్కకుంటే అప్పుడు పద్ధతి మార్చుకుంటారా?


స్వామి భక్తిలో తరిస్తున్న జోగి రమేశ్ ఇప్పుడు ఏమౌతారో? రెడ్డి సామాజికవర్గ సారథ్యాన నడుస్తున్న ప్రభుత్వంలో జోగి రమేశ్ సాధించేదేంటో ? ఇప్పటిదాకా వెనుకబడిన కులాలకు, ద‌ళిత సామాజిక‌వ‌ర్గాల‌కు జగన్ ప్రభుత్వం చేసిందేంటో చూడాలిక. ఇప్పు డు తాజా విస్తరణలో బీసీల కు దక్కేచోటు, అలానే ఇతర సామాజిక వర్గాలకు దక్కే చోటు ఎంతన్నది కూడా తేలిపోనుంది. మరి! జగన్ ను కాపాడుతున్న శక్తుల న్నింటికీ కొత్త క్యాబినెట్ కూర్పులో చోటిస్తారు సరే! అధికారం ఇస్తారా? ఎందుకంటే ఇప్పటిదాకా అధికారం అంటే జగన్, జగన్ అంటే అధికారం అన్న విధంగా రూలింగ్ నడుస్తున్న తరుణాన వైసీపీ సర్కారు సాధించేదేంటి అన్న ది టీడీపీ ప్రశ్న. బీసీ కు లాల పేరిట కార్పొరేషన్లు ఇవ్వడమే గొప్ప అయితే ముందు సబ్ ప్లాన్ నిధుల సంగతేంటి? వాటిని ఏం చే శారు? అలానే వృత్తిదారు ల సంగతేంటి వారిని ఎవరు ఎలా ఆదుకున్నారు అన్నవి కూడా తేల్చాలి అని అడుగుతున్నాయి టీడీపీ వర్గాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: