వాజీ వాజీ శివాజీ : రంగంలోకి మ‌రో విధేయుడు ?

RATNA KISHORE
సీనియ‌ర్ లీడ‌ర్ అయ్య‌న్న వివాదంలో రోజురోజుకూ తీవ్ర‌త పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. జోగి ర‌మేశ్ కూడా త‌గ్గ‌డం లేదు. అంతేకాదు ప్రెస్మీట్ల మీద ప్రెస్మీట్లు పెట్టి వివాదాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. నిన్నటి వేళ కొంద‌రు జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ప‌లుకుతూ మీడియా ఎదుట మాట్లాడారు. ఆ కోవ‌లో కారెం శివాజీ కూడా చేరారు. క్యాబినేట్ విస్త‌ర‌ణ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఇంకొంత మంది స్వామి భ‌క్తికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వారంతా తెర‌పైకి రావ‌డం మినహా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించే వారు మాత్రం ఉండ‌రు అని కొంద‌రు ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.
అయ్య‌న్న పాత్రుడి వ్యాఖ్య‌ల వివాదంలో రోజుకో విధేయుడు తెర‌పైకి వ‌స్తూ ప్ర‌భు భ‌క్తిని చాటుతున్నారు. దీంతో జ‌గ‌న్ త‌న మ‌ద్ద‌తు దారుల‌తో అయ్య‌న్న‌పై ప్ర‌త్య‌క్షంగా మాటల యుద్ధం కొన‌సాగించేలా చేస్తున్నారు. ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగ‌ద‌ని కూడా తెలుస్తోంది.


ముఖ్యంగా సీఎం స్థాయి వ్య‌క్తిని సీనియ‌ర్ లీడ‌ర్ ఆ విధంగా మాట్లాడ‌డం త‌ప్పు అనే భావ‌నకు టీడీపీ ఇంకా రాలేక‌పోతోంది. అంతేకాకుండా తాము చేసింది త‌ప్పే కాదు అని, జోగి ర‌మేశ్ బూతు పురాణం ఎలా ఉందో చూడండంటూ వీడియోలు విడుద‌ల చేస్తోంది. దీంతో ఇవ‌న్నీ కాస్త వైర‌ల్ అవుతూ ప్ర‌జ‌ల‌కు మిక్కిలి వినోదాన్ని పంచుతున్నాయి.


సాధార‌ణంగా ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన వెంట‌నే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు న‌మోద‌వుతాయి. కానీ అలాంటివేవీ జ‌ర‌గ‌లేదు స‌రిక‌దా ఇంత‌వ‌ర‌కూ అయ్య‌న్న‌ను అరెస్టు చేస్తాం అన్న మాట కూడా జ‌గ‌న్ అనుకోలేక‌పోతున్నాడు. అన లేక‌పోతున్నాడు. ఎందుక‌నో ఆయ‌న వెన‌క్కు త‌గ్గిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రో వీర విధేయుడు తెర‌పైకి వ‌చ్చాడు.


 
శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రానికి  నిన్న‌టి వేళ విచ్చేసిన ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ మాజీ చైర్మ‌న్  కారెం శివాజీ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇస్తూ మాట్లా డారు. అయ్య‌న్న వ్యాఖ్య‌లు ఆయ‌న స్థాయికి త‌గివ‌ని కావ‌ని అన్నారు. చంద్ర‌బాబు కార‌ణంగానే అయ్య‌న్న అలా మాట్లాడి ఉంటా ర‌ని చెప్పారు. చంద్ర‌బాబు కార‌ణంగానే రాష్ట్రంకు ప‌రిశ్ర‌మ‌లు రావ‌డం లేద‌ని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఇప్ప‌టిదాకా జ‌గ‌న్ కు మ‌ద్దుతుగా నిలిచిన స‌భ్యుల‌లో శివాజీ కూడా చేరిపోయారు. ఇంకేం త్వ‌ర‌లో ఎమ్మెల్సీ ప‌ద‌వి ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: