మాజీ మేయర్ ప్రాణత్యాగమే స్టాలిన్ ను బ్రతికించింది...

VAMSI
ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే పగ్గాలు అందుకుని పాలన సాగిస్తున్న ఎంకే స్టాలిన్ గురించి చాలా మందికి కొన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. తన పాలనలో ఈ రోజు రాష్ట్రమంతా ప్రశాంతంగా సంతోషంగా ఉంది. ఈ రోజు మనము చూస్తున్న స్టాలిన్ ఒకప్పుడు మరణపు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఆ రోజు అలా జరిగి ఉంటే మనకు స్టాలిన్ ఉండేవాడు కాదు. అయితే గతంలో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం. అప్పుడు కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు... స్టాలిన్ కు సరిగ్గా 23 సంవత్సరాలు ఉంటాయి. కొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆశ్చర్యకరంగా డీఎంకే నేతలను ఒక్కొక్కరుగా జైల్లో పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే జైల్లో పెట్టాల్సిన వారి లిస్ట్ లో ఎంకె స్టాలిన్ పేరు కూడా ఉంది. స్టాలిన్ ను అరెస్ట్ చేయడానికి ఇంటికొచ్చిన పోలీసులకు నిరాశే ఎదురైంది.
అప్పటికే స్టాలిన్ ఒక ప్రచారసభ కోసం నాటకం వేయడానికి బయట ఊరు వెళ్ళాడు. కానీ కరుణానిధి నా కొడుకు రాగానే నేనే మీకు అప్పగిస్తాను అని మాటివ్వడంతో తిరిగి వెళ్ళిపోయారు పోలీసులు. అలా ఊరి నుండి  వచ్చిన స్టాలిన్ ను తండ్రే స్వయంగా పోలీసులకు అప్పగించాడు. అయితే ఇలా జరుగుతుందని ఆ ఇంట్లో ఎవరూ ఊహించలేదు అందరూ కన్నీరు మున్నీరయ్యారు. అలా స్టాలిన్ ను తీసుకెళ్లిన పోలీసులు రోజంతా జీపులోనే తిప్పి రాత్రి సెంట్రల్ జైల్లో స్పెషల్ సెల్ లో పెట్టారు. ఇక అప్పటి నుండి స్టాలిన్ ను చిత్ర హింసలు పెట్టారు. ఒక మాజీ సీఎం కొడుకు అని కూడా ఆలోచించకుండా ఇబ్బంది పెట్టిన తీరు చాలా విచారకరం. 23 సంవత్సరాల యువకుడిని కూడా చూడకుండా బట్టలు విప్పి లాఠీలతో చావు దెబ్బలు కొట్టారు. అయితే ఇదంతా చేసింది రాజకీయాల్లో నేను ఇక ఉండను అని స్టాలిన్ చేత రాతపూర్వకంగా తీసుకోవడానికి మాత్రమే. కానీ దానికి స్టాలిన్ ఏ మాత్రం అంగీకరించలేదు.
అయితే పోలీసులు స్టాలిన్ ను ఒప్పించడానికి అక్కడున్న ఖైదీల చేత కూడా కొట్టించారు. అలా కొట్టడంతో తన భుజం కండ లేచిపోయింది. ఇది చూసిన పక్క ఖైదీ దీన్ని ఆపడానికి వచ్చాడు. పోలీసులు అతనిని కడుపు మీద తన్నడంతో రక్త గాయాలతో అక్కడే పడిపోయాడు. తర్వాత అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లినా చనిపోయాడు. ఆయనే మాజీ మేయర్ చిట్టిబాబు. ఆయనే లేకపోతే ఈ రోజు స్టాలిన్ ప్రాణాలతో ఉండేవాడు కాదేమో. ఆ మేయర్ చావు పోలీసుల్లో మార్పు తెచ్చింది. అలా ఒక సంవత్సరం పాటు జైలు జీవితాన్ని గడిపిన స్టాలిన్. ఒక మానసికంగా బలమైన రాజకీయ నాయకుడిగా బయటకు వచ్చాడు.  అలా డీఎంకే జనరల్ కౌన్సిల్ లో సభ్యుడయ్యాడు.  అలా రాజకీయంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని జైలు జీవితాలను అనుభవించిన ప్రజల కోసం సీఎం అయ్యాడు.  గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన జయలలిత మరియు కరుణానిధి ల కన్నా మిన్నగా పాలన సాగిస్తూ ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: