న‌మ్మ‌లేని నిజాలు : బాబోయ్ సింగ‌రేణి కాల‌నీ..!

RATNA KISHORE
నేర‌స్తుడు చ‌చ్చాడు నేరం  చావ‌లేదు అని చెబుతున్న కొంద‌రు సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు సింగ‌రేణి కాల‌నీ గురించి విస్తుబో యే నిజాలు చెప్పారు. ఆ..వివ‌రం ఆధారంగా రాస్తున్న క‌థ‌నం ఇది..


చిన్నారి చైత్ర చ‌నిపోయింది. రాజు చ‌చ్చిపోయాడు. ఇక‌పై ఏద‌యినా జ‌రిగే అవ‌కాశం ఉంటే ఆ కాల‌నీలో రావాల్సిన మార్పు మాత్ర‌మే గొప్ప విష‌యం! వ‌స్తుందా అన్న‌దే సంశ‌యం. అవును! క‌వి తిల‌క్ అన్నాడు గ‌జానికో గాంధారీ పుత్రుడున్న దేశం ఇది అని! డ్ర‌గ్స్ విచ్చ‌ల‌విడిగా అక్క‌డ కూడా దొరుకుతున్నాయి. ఇంజ‌నీరింగ్ చ‌దివే అమ్మాయిల‌కు అదే ఎంజాయ్ మెంట్ ప్లేస్ అని కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ క‌థ‌నం అందిస్తోన్న స‌మాచారం. నిర్థారించుకున్న పోలీసులు ఏం చేయాలేరు తెలుసు వాళ్ల‌కు, వాళ్ల‌ను ప‌ట్టుకుంటే పెద్ద‌వాళ్ల కుటుంబాల నుంచి ఒత్తిళ్లు ఫోన్ల రూపంలో వ‌స్తాయ‌ని? ఇప్పుడు చెప్పండి అక్క‌డ ఆ పాప ఉండ‌డం ఇంత‌కాలం సుర‌క్షిత‌మేనా? ఇంకెంద‌రు అలా బ‌లైపోయారో మ‌నకు స‌మాచారం ఏమ‌యినా ఉందా?
కొద్ది రోజులుగా సింగ‌రేణి కాల‌నీ పేరు వింటున్నాం. మాన‌వ మృగం రాజు మాన‌సిక స్థితి గురించి కూడా వింటున్నాం. అత‌డు ఓ సైకో అని కూడా అంటున్నారు పోలీసులు. అలాంటివాడికి ఆ కాల‌నీలో చోటెవ్వ‌రు ఇచ్చారు? ఇది కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గానే వినిపిస్తున్న ప్ర‌శ్న‌లు. మాన‌సిక దౌర్బ‌ల్యం, చిత్త చాప‌ల్యం ఉన్న‌వారిని ఎలా త‌మ మ‌ధ్య‌నే ఉంచుకున్నారు. గ‌తంలో కూడా అత‌డు మ‌హిళ‌ల‌ను ఇలానే వేధించాడు, తాగిన మ‌త్తులో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాడు. అత‌డు గంజాయి సేవిస్తాడు. ప‌నీ పాటూ లేకుండా తిరుగుతాడు. తాగుతాడు. తాగాక అమ్మాయిల‌తో స‌హ‌వాసం కోరుకుంటాడు. ఇవ‌న్నీ ఉన్నోళ్లంతా అక్క‌డే ఉన్నారు. ఒక్క రాజు కాదు ఆ కాల‌నీలో చాలా మంది ఇంత‌టి నీఛ సంస్కృతిలోనే ఉన్నారు. ఇప్పుడేం అంటారు?
చీక‌ట‌యితే చాలు గంజాయి పీలుస్తారు. డ్ర‌గ్స్ కూడా అక్క‌డే అమ్ముతారు అని అనుమానం. చిన్నారి చైత్ర‌ను చంపేసిన ఆ కామాం ధుడి కాల‌నీలో జ‌రిగేవ‌న్నీ చీక‌టి కార్య‌క‌లాపాలే. డ్ర‌గ్స్‌, వ్య‌భిచారం, ఇత‌ర మ‌త్తు ప‌దార్థాల అమ్మ‌కం, మ‌ద్యం ఇవ‌న్నీ విచ్చ‌ల‌విడి గా దొరికే ప్రాంతంలో ఆ చిన్నారి చైత్ర ఉంటోంది. ఇదీ సింగ‌రేణి కాల‌నీ గురించి, ఆ గుట్టు గురించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవు తున్న క‌థనం. పోలీసుల‌కు ఆ ఏరియా గురించి తెల్సు అని, కానీ ఎవ్వ‌రూ అటుగా చూడ‌ర‌ని కూడా క‌థ‌నం చెబుతోం ది. ఇక చీక‌టై తే వ్య‌భిచారం చేసే మ‌హిళ‌ల‌కు కొద‌వే ఉండ‌దు అని కూడా తెలుస్తోంది. ఇంత జ‌రిగినా ఆ కాల‌నీలో ఎప్ప‌టి నుంచో జ‌రిగే చీక‌టి కా ర్య‌క్ర‌మాలు ఒక్క‌సారిగా ఏమీ ఆగిపోవు. పోనీ పోలీసుల చ‌ర్య‌లు ఏమ‌యినా  ఉన్నాయా అంటే అదీ లేదు. ఇంకేం చేస్తార‌యితే?

మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: