జగన్ పాలనపై ప్రజల అభిప్రాయం ఇదే ?

VAMSI
మొదట 2014 వ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనా ఆత్మవిశ్వాసం ఏ మాత్రం కోల్పోకుండా ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పదంతో, దృఢమైన సంకల్పంతో పాదయాత్ర అంటూ ప్రజల మధ్య నడిచి వారి కష్టనష్టాలను, సుఖదుఃఖాలను తెలుసుకున్నారు. జనాల మేలు ఎరిగిన నాయకుడిగా మన్ననలను పొంది ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక మెజారిటీతో ఘన విజయాన్ని అందుకుని 2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇక అప్పటి నుండి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు నడుం బిగించారు. మునుపెన్నడూ ఎరుగని రీతిలో పాలన కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారు. నవ రత్నాల్లో చెప్పిన ప్రతి సంక్షేమాన్ని నెరవేరుస్తూ జనం చేత జేజేలు పలికించు కుంటున్నారు సిఎం జగన్.
వైఎస్సార్ రైతు భరోసా, పేదలందరికీ ఇల్లు, అమ్మఒడి, అందరికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, పింఛన్ల పెంపు ఇలా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ మాట తప్పని రారాజుగా ప్రజల గుండె చప్పుడు విన్న నాయకుడిగా ప్రజల గుండెల్లో స్థానాన్ని గెలుచుకున్నాడు. నాణేనికి బొమ్మ, బొరుసు రెండు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా వైఎస్ జగన్ పరిపాలనను ప్రశంసిస్తూ ఆయన్ని దేవుడిగా పూజించేవారు ఎలా అయితే ఉన్నారో, అలాగే ఆయన్ని విమర్శించే వారు కూడా లేకపోలేదు. అయితే వైయస్ జగన్ పాలనకు పట్టం కడుతూ ఆయన్ని కీర్తిస్తూ జై  కొట్టే జనాల ముందు ఇవన్నీ ఏ మాత్రం లెక్కకు రావని అంటుంటారు. వాస్తవంలో కూడా జగనన్న అభివృద్ధి పథకాలు వైయస్ జగన్ ను జనాలను మరింత చేరువ చేస్తున్నాయి.
రోజు రోజుకి ప్రజల్లో ఆయనకు మద్దతు మరింత పెరుగుతోందని ఒక అంచనా. ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని, ఆదర్శనీయం అని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లెక్కన ఈ సారి ఎన్నికల్లోనూ పై చేయి జగనన్నదేనని అంటున్నారు ప్రజలు. మరి ఇది నిజమవుతుందా ప్రజలే తన విజయంలో పాత్రులయి తమ బలాన్ని మరో సారి చూపిస్తారా అంటే చూడాలి ఏమి జరగనుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: