జగన్ ఎన్నికలకు రెడీ.. ఈసారి పాదయాత్ర కాదు.. ఇంటింటికి?

praveen
జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తుంది..  ఈ మూడేళ్ల కాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు అన్నీ సంచలనాలే అని చెప్పాలి. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు మిగిలి ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేబినెట్ మంత్రులతో సమావేశం నిర్వహించారు సీఎం జగన్. ఇక ఈ సమావేశంలో రెండు సంవత్సరాలలో  పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఎలా ముందుకు సాగాలి అనే విషయంపై మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది.

 అయితే 2019 ముందు అధికారంలోకి రావడానికి సీఎం జగన్ పాదయాత్ర నిర్వహించారు అన్న విషయం తెలిసిందే  ఇలా అచ్చం తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి తరహాలోనే పాదయాత్ర నిర్వహించి ప్రజల్లోకి వెళ్లి.. ప్రజల కష్టాలను తెలుసుకుని  అందరిలో భరోసా కల్పించారు. ఈ పాదయాత్ర జగన్ భారీ మెజారిటీ సాధించేందుకు కారణం అయ్యింది. నాడు అధికారంలో ఉన్న టిడిపి ఎన్ని ఇబ్బందులు సృష్టించిన పాదయాత్ర ఆపకుండా చేశారు సీఎం జగన్.  మరి ఈసారి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం జగన్ పాదయాత్ర చేస్తారా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది.

 అయితే ఈసారి పాదయాత్ర కాదు వినూత్న ప్లాన్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన తర్వాత అందరం మళ్ళీ రోడ్ల మీదికి వచ్చి తిరగాల్సిందే. గడపగడపకు వైసిపి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల కష్టాలను తెలుసుకోవాలి. కరోనా వైరస్ పరిస్థితులను బట్టి ఇక రచ్చబండ కార్యక్రమాలు స్వయంగా నేనే నిర్వహిస్తానని సీఎం జగన్ తెలిపారట. అంతేకాదు మంత్రులు ఎమ్మెల్యేలు అక్టోబర్ నుంచి సచివాలయం సందర్శించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.  ఇలా ఈసారి పాదయాత్ర కాకుండా ఇంటింటికి వైసీపీ అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: