ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు.. జ‌గ‌న్‌కు వ‌చ్చే సీట్ల లెక్క‌లివే..!

VUYYURU SUBHASH
ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయంటూ గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంపై వైసీపీ నేత‌లలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌గ‌న్ ఏకంగా 151 సీట్ల‌తో భారీ మెజార్టీతో విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చారు. జ‌గ‌న్‌కు అంత బంప‌ర్ మెజార్టీ వ‌స్తుంద‌న్న విష‌యం ఆయ‌నే ఊహించి ఉండ‌రు. మ‌హా అయితే వైసీపీకి 120 సీట్లు వ‌స్తాయ‌ని చాలా మంది అనుకున్నారు. అంత‌కు మించి వైసీపీకి సీట్లు రావ‌నే చాలా మంది అన్నారు. జ‌గ‌న్ చివ‌ర‌కు అంద‌రి అంచ‌నాలు త‌ల్ల‌కిందులు చేస్తూ అధికారంలోకి వ‌చ్చారు . జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఓటు బ్యాంకుతో త‌న వైపు ట‌ర్న్ చేసే ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు.
సంక్షేమం, ప్ర‌జ‌ల ఖాతాల్లోకి డ‌బ్బులు వేయ‌డం లాంటి విష‌యాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌స్సులు గెలుచుకునేందుకే ముందు నుంచి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. అస‌లు ఏపీలో అభివృద్ధి అన్న ప‌దం ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. అయితే జ‌గ‌న్ మాత్రం ఓటు బ్యాంకు పెంచుకునే విష‌యంలో ప్ర‌ధానంగా దృష్టి సారిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడిప్పుడే ప్ర‌భుత్వంపై స్వ‌ల్పంగా వ్య‌తిరేక‌త పెరుగుతోన్న ప‌రిస్థితి ఉంది. రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌ధానంగా సంక్షేమంపై కాన్ సంట్రేష‌న్ చేయ‌డంతో అభివృద్ధి ఆగిపోయింద‌నే అంటున్నారు.
ర‌హ‌దారులు అధ్వానంగా ఉన్నాయి. ముఖ్య‌మంత్రి తీసుకుంటోన్న కొన్ని నిర్ణ‌యాలు సొంత పార్టీ నేత‌ల‌కే న‌చ్చ‌డం లేదు. మ‌రో వైపు రాష్ట్రం లోటు బ‌డ్జెట్ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు ఎన్ని చేయాల‌ని ఉన్నా కొన్ని చేసేందుకు నిధుల కొర‌త తీవ్రంగా ఉంది. మ‌రోవైపు ఇచ్చిన హామీలు , ప్ర‌జ‌ల్లో అంచ‌నాలు తీవ్రంగా ఉన్నాయి. ఇదే ప‌రిస్థితి వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కు కొన‌సాగితే ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంటుంది. అందుకే ఈ సంక్షేమాన్ని ఇలానే కొన‌సాగిస్తూ యేడాది లేదా 10 నెల‌ల ముందుగా ఎన్నిక‌ల‌కు వెళ్లి మ‌రోసారి అధికారంలోకి రావాల‌న్న‌దే జ‌గ‌న్ ప్లాన్‌. అందుకే జ‌గ‌న్ త‌న మంత్రుల స‌మావేశంలో ముంద‌స్తు సిగ్న‌ల్స్  ఇచ్చిన‌ట్టు టాక్ ? అయితే ఈ సారి మాత్రం 151 సీట్లు రాక‌పోయినా 100 సీట్ల‌తో అయినా మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని వైసీపీ వాళ్లు లెక్క‌లు వేసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: