అచ్చెన్నకు ఇంకా అర్ధం కాలేదట! ఏం చిత్రం స్వామీ!
ఇక, కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కూడా కృషి చేశామన్నారు. ఇంత చేసినా.. తమకు ఉత్తరాంధ్ర ప్రజలు కనీస గౌరవం ఇవ్వలేదని.. కనీస ఓట్లు కూడా రాల్చలేదని.. నిష్టూరాలాడారు. ఇలా ఎందుకు జరిగిందో కూడా తనకు అర్ధం కావడం లేదని.. చెప్పుకొచ్చారు. ఇదే ఇప్పుడు అచ్చెన్నను ట్రోల్ అయ్యేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఉత్తరాంధ్ర సహా.. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సునామీ జోరుగా సాగింది.
అంతేకాదు.. ఉత్తరాంధ్రను పట్టించుకున్నది ఎప్పుడు? అనేది కూడా కీలక ప్రశ్న. కేవలం తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబు అక్కడ కూర్చున్నారు. మరి మిగిలిన సమయాల్లో.. ప్రజలను పట్టించుకున్నారా? అనేది కీలక ప్రశ్న, అంతెందుకు.. అచ్చెన్న సొంత జిల్లాలోనే పార్టీ పూర్తిగా ఓడిపోయింది. ఒకటి రెండు స్థానాలు తప్ప. టెక్కలిలో అచ్చెన్న చచ్చీ చెడీ గెలిచారు. ఇక శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు కేవలం ఏడెనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరో వైపు ఇచ్ఛాపురంలోనూ బెందాళం అశోక్ 4 వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.
దీనికి కారణం ఎవరు? ఆయన మంత్రిగా ఉన్నారు. అంతా చేశానని చెప్పుకొచ్చారు. కానీ, పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కారణాలు ఇప్పుడు తవ్వుకునే కన్నా.. చేయాల్సింది చేసి ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైనా.. క్షేత్రస్థాయిలో శాశ్వత ప్రాతిపదికన చేయాల్సని పనులు.. చేస్తే.. పార్టీ పుంజుకునేందుకు వఅవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.