తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి..!
తెలంగాణ రాష్ట్రంలోకరోనా పరిస్థితులపై ధర్మాసనం విచారించింది. కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు.. పూర్తి వివరాలతో కూడిన అపిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కరోనాపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి.. స్కూళ్లు గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ఇక ఏపీలో గడిచిన 24గంటల్లో 62వేల 252కరోనా టెస్టులు చేస్తే 1,445మందికి పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న 11మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 33వేల 419కు చేరగా.. ఇప్పటి వరకు 14వేల 030 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 1,243మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14వేల 603 యాక్టివ్ కేసులున్నాయి.
ఇక దేశంలో కొత్తగా 27వేల 176కరోనా కేసులు వెలుుగు చూశాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3కోట్ల 33లక్షల 16వేల 755కు చేరింది. మరో 284మంది చనిపోగా.. ఇప్పటి వరకు మహమ్మారి ధఆటికి 4లక్షల 43వేల 487మంది మరణించారు. కొత్తగా 38వేల 012మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 3కోట్ల 25లక్షల 22వేల 171కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3లక్షల 51వేల 087 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని హెచ్చరించింది.