ప్రేమ గుడ్డిదే.. వృద్ధురాలిని పెళ్లి చేసుకున్న యువకుడు?

praveen
మామూలుగా వయసులో ఉన్న కుర్రాళ్ళు ప్రేమలో పడటం సహజం.  ఇక తమకు నచ్చిన  విధంగా ఉన్న అమ్మాయిని చూసి వారితో ప్రేమలో పడతారు. ఇక వారి ప్రేమను వ్యక్తపరిచి..  ఇక తమకు నచ్చిన యువతితో ప్రేమలో మునిగి తేలుతూ ఉండడం ఇప్పుడు వరకు చూశాము. కానీ ఇక్కడ ఒక యువకుడు చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అతని వయస్సు 24 ఏళ్లు.  ఇటీవలే అతడు ప్రేమలో పడ్డాడు. ప్రాణం కంటే ఎక్కువగా ఆమెను ప్రేమించాడు. ఇక ప్రేయసిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. ఇక ఆమెతోనే జీవితం గడపాలి అని అనుకున్నాడు.



 ఇక సదరు యువకుడు తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు.. ఇందులో షాక్ అవ్వడానికి ఏముంది..  24 ఏళ్ల యువకుడు ప్రేమలో పడి వివాహం చేసుకుంటే అందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా..  అయితే ఆ 24 ఏళ్ల యువకుడు ప్రేమించింది యువతిని కాదు 61 ఏళ్ల బామ్మని.  ఇక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది కూడా ఆమెనే . ఆశ్చర్య పోయారు కదా.. కానీ ఈ ఘటన ఇటీవల అమెరికాలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా పెళ్లై ఏడుగురు పిల్లలు ఉన్న ఒక 61 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.



 ఇక వీరిద్దరి పెళ్లి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.  అమెరికాలో వృద్ధ మహిళ షెరిల్ మెక్ గ్రెగర్ కుర్రాడు కోరాన్ మెక్కెయిన్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. 2013లో వీరికి తొలిసారిగా పరిచయం అయింది.  ఆ సమయంలో ఆ కుర్రవాడి వయసు కేవలం పదిహేనేల్లు మాత్రమే.  ఆ తర్వాత వీరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారి పోయింది. ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం పెరిగిపోయింది. ఇక ఇటీవలే ఇద్దరి జంట ఏకంగా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అయితే సదరు మహిళకు ఇప్పటికే ఏడుగురు పిల్లలు ఉండగా వీరిలో ముగ్గురు పిల్లలు యువకుడితో పెళ్లికి అంగీకరించలేదు. కాగా ఆ యువకుడికి మాత్రం ఇదే మొదటి వివాహం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: