బాబు కోసమే మంత్రి...అప్పలరాజు కూడా అంతేనా...
పోనీ ఆ విమర్శల్లో ఏదైనా లాజిక్ ఉంటే బాగుంటుందని అలా కాకుండా అమర్యాదగా మాట్లాడుతూ...ఏ మాత్రం లాజిక్ లేకుండా మంత్రులు తిడతారని చెబుతున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు కూడా అదే బాటలో పయనించారని అంటున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వం జీవో 217ని తీసుకొచ్చింది. ఇక ఈ జీవోని రద్దు చేయాలని చంద్రబాబు, సోము వీర్రాజులు సిఎం జగన్‌కు లేఖ రాశారు.
ఇక దీనిపై అప్పలరాజు ఫైర్ అయ్యారు. 217 జీవో వల్ల నష్టమేమిటో చెప్పాలని, ఆ జీవో నెల్లూరు జిల్లాకు మాత్రమే పరిమితమని, వీర్రాజు రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని, మత్య్సకారులకు బిజేపి, టిడిపిలు అన్యాయం చేస్తున్నాయని, చంద్రబాబు చెప్పినట్టు డ్రామాలు ఆడొద్దని వీర్రాజుకు కౌంటర్ ఇచ్చారు.
అయితే ఇక్కడ అప్పలరాజు ఏ మాత్రం లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారని, అసలు సోము వీర్రాజు ఎవరి డైరక్షన్‌లో పనిచేస్తారో అందరికీ తెలుసని, చంద్రబాబు అంటే ఆయనకు ఎంత పగ ఉందో కూడా తెలుసని, ఇక బిజేపితో రహస్య బంధాన్ని కొంసాగిస్తుంది ఎవరో కూడా తెలుసని టిడిపి శ్రేణులు అప్పలరాజుకు కౌంటర్ ఇచ్చాయి.
కేవలం మంత్రి పదవిని నిలబెట్టుకోవాలంటే చంద్రబాబుని తిట్టాలనే కోణంలోనే అప్పలరాజు ఉన్నారని, అంటే ఎంత ఎక్కువగా తిడితే అంత ఎక్కువగా అప్పరాజు మంత్రి పదవి ఉంటుందని అనుకుంటున్నారని తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. మరి అందరి మంత్రుల మాదిరిగా కాకుండా కాస్త అప్పలరాజు కొత్తగా ట్రై చేస్తే బెటర్ అని కౌంటర్ ఇస్తున్నారు.