కెసిఆర్ సారు.. పథకాలు సరే.. ఉద్యోగాల మాటేంటి?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ కూడా ఇదిగో నోటిఫికేషన్లు ప్రకటిస్తాం అదిగో నోటిఫికేషన్లు ప్రకటిస్తాం అని.. ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడమే తప్ప ఇప్పటి వరకు నోటిఫికేషన్ లు ప్రకటించిన దాఖలాలు లేవు. ఎక్కడైనా ఎన్నికలు వచ్చాయి అంటే చాలు నిరుద్యోగులు అంశాన్ని తెరమీదికి తెస్తున్నారు. మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ ప్రకటించబోతున్నట్లు చెప్పి నిరుద్యోగులు అందరిలో ఆశలు కల్పిస్తున్నారు. ఇక ఎన్నికలు అయిపోగానే అసలు నోటిఫికేషన్ అనే మాటనే గాల్లో కలిపేస్తున్నారు . ఇక ఎన్నో రోజుల నుంచి తెలంగాణలో ఇదే జరుగుతుంది. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించడానికి పథకాలు తీసుకొచ్చి లక్షల రూపాయలు ఇస్తున్నారు. సరే మరి నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు యువత.
దీంతో ప్రస్తుతం అటు కేసీఆర్ ప్రభుత్వం పై నిరుద్యోగుల్లో రోజురోజుకు వ్యతిరేకత పెరిగిపోతుంది. ఇప్పటికే ఉద్యోగాలు రావడం లేదని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక అటు కేసీఆర్ సార్ కి కేవలం ఎలక్షన్లు వస్తేనే నిరుద్యోగులు గుర్తుకు వస్తారు అని.. ఇక రాష్ట్రంలో పోస్టుల భర్తీ ఉంటుంది అన్న విషయం కూడా యాదికి వస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.