ఆ టీడీపీ నేతలకు చినబాబు వార్నింగ్...సైడ్ చేసేస్తారా?
అలాగే చంద్రబాబు బ్యాగ్రౌండ్‌లో ఉంటే లోకేష్ ఫీల్డ్‌లో దిగి రాజకీయం నడిపిస్తున్నారు. ప్రజల్లోకి వేగంగా వెళుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్న వెంటనే స్పందిస్తున్నారు. ఇవేగాక పార్టీని గాడిలో పెట్టేందుకు లోకేష్ ఓ ప్రణాళికని రూపోదించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పార్టీ ఓటమి పాలవ్వడం వల్ల చాలామంది నాయకులు సైలెంట్ అయ్యారు. దీంతో పలు నియోజకవర్గాల్లో టిడిపిని నడిపించే నాయకులే లేరు. అలాగే పలు నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు అసలు యాక్టివ్‌గా లేరు. ఈ క్రమంలోనే అధినేత చంద్రబాబు, ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని పెట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఒకటి రెండు నెలల్లో 175 నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో చినబాబు కొందరు టిడిపి నేతలకు లైట్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంచార్జ్‌లుగా ఉంటూ, యాక్టివ్‌గా లేని నాయకులని సైడ్ చేస్తామని చెప్పినట్లు సమాచారం.
ఇప్పటికే పలువురు నాయకులు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదు. అలాగే నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. అలాంటి వారిని సైడ్ చేసేసి బలమైన నాయకులని పెట్టాలని చినబాబు చూస్తున్నారట. ఒకసారి చూసి పనితీరు బాగోకపోతే పక్కకు తప్పిస్తామని ఆ టిడిపి నాయకులకు వార్నింగ్‌లు వెళ్ళాయని తెలుస్తోంది.