టీఆర్ఎస్ పార్టీలో పదవుల జాతర షురూ ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో  ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది.  ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న ఈ పార్టీ...  ప్రత్యేక రాష్ట్రం సాధించాక..  రాజకీయ పార్టీ గా అవతరించింది.  ఇక అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం లో టీఆర్‌ఎస్‌ పార్టీ చక్రం తిప్పుతోంది.  అయితే...  ప్రస్తుత పరిస్థితుల్లో...  పార్టీ నేతల పై దృష్టి సారించింది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ. ఈ నేపథ్యం లో నిన్న జల విహార్‌ లో నిన్న పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా పార్టీ నేతలకు తీపి కబురు అందించారు.  


పార్టీ లో పని చేసిన వారు ఇంకా పదవులు రాక నిరాశ తో వున్నారని పేర్కొన్న మంత్రి కేటీఆర్‌...  త్వరలోనే 4, 5 వందల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని వారికి హామీ ఇచ్చారు.  Ghmc ఎన్నికల సందర్భంగా కొందరికి కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చామని తెలిపిన ఆయన ..దాని కూడా అమలు చేసే బాధ్యత తనదేనని కుండ బద్దలు కొట్టారు.  పార్టీ లో వచ్చే పదవికి కూడా ప్రజల్లో గౌరవం వుంటుందని....  గ్రేటర్ లో సెప్టెంబర్ 20 లోపు పార్టీ బస్తీ, కాలనీ కమిటీలు వేసుకోవాలని పిలుపు నిచ్చారు  కేటీఆర్‌.   జిహెచ్ఎంసి 150 డివిజన్ లకు పార్టీ కమిటీలు వేసుకోవాలని... జిహెచ్ఎంసికి ఒక్కటే కమిటీ ఉండాలా లేక జిల్లాల కమిటీలు ఉండాలా అనేది పార్టీలో  నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు  కేటీఆర్‌.


2021 లో టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందని తెలిపారు  కేటీఆర్‌.  తెలంగాణ బిజెపి మరియు తెలంగాణ  కాంగ్రెస్ పదవులు  సీఎం కేసీఆర్ బిక్ష అని తెలిపారు.   కేసీఆర్ కాలి గోటికి సరిపోని నాయకులు ఆయన మీద మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్‌. అంతేకాదు.. ఇక నుంచి ఏ పార్టీ అయినా... టీఆర్‌ఎస్‌ పార్టీ పై విమర్శలు చేస్తే...  అదే స్థాయిలో దూకుడు గా వ్యవహరించాలని పిలుపు నిచ్చారు మంత్రి కేటీఆర్‌. అసలు...  విపక్షాలకు ఛాన్స్‌ ఇవ్వ కూడదని తెలిపారు. ఇక కేటీఆర్‌ తాజా ప్రకటన తో...  టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు మరియు నేతల్లో కొత్త జోష్‌ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: