ఆ ఉపగ్రహంపై నీటిని కనుగొన్న నాసా... ?
అయితే తాజా పరిశోధనలు ప్రకారం గనీమెడ్ ఉపగ్రహం అంతా కూడా దట్టమైన మంచుతో కప్పబడి ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ మంచును కరిగించి, ఆ నీరు మానవుడు తాగడానికి లాగా ఉపయోగపడుతుందా లేదా అన్నది ఇంకా తేలలేదు. అతి త్వరలోనే ఈ విషయం కూడా బహిర్గతం చేస్తామని నాసా తెలిపింది. అయితే ఈ మంచు గడ్డను పై నుండి దాదాపుగా 160 కిలో మీటర్ల వరకు తవ్వుకుంటూ పోతేనే నీరు మనకు ఉపయోగపడుతుందా లేదా అని తెలుస్తుందట. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఈ మంచు పైన ఉష్ణోగ్రత స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు. ఈ ఉష్ణోగ్రత స్థాయి 138 నుండి 183 డిగ్రీల వరకు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.
అంత ప్రమాదకరమైన చలిలో ఆ మంచును 160 కిలోమీటర్ల వరకు తవ్వడమంటే ప్రాణాలతో ఐస్ హాకీ ఆడినట్టే అవుతుందంటున్నారు. దీనికి వేరే మార్గం ఉన్నట్లు అయితే ప్రస్తుతానికి తెలియడం లేదు. అయితే ఈ ఉపగ్రహం మధ్యరేఖ దగ్గర అప్పుడప్పుడు మంచు కరుగుతూ ఉంటుందని తెలుస్తోంది. ఆ సమయంలో ఆ నీటి నుండి ఆక్సిజన్ రేణువులు బయటడుతాయట. ఈ ఉపగ్రహం పై నిలబడవచ్చు అని చెబుతున్నారు. ఇది భూమి కంటే 11 రెట్లు పెద్దది. ఈ ఉపగ్రహాన్ని కనుక మానవునికి ఉపయోగపడే ప్రదేశంగా మార్చుకోగలిగతే నాగరికత ఇంకా అభివృద్ది చెందడానికి దోహదపడుతుంది అని నాసా తెలియచేస్తోంది. మరి త్వరలోనే గనీమెడ్ ఉపగ్రహం పై ఉన్న మంచును కరిగించి నాసా నీటిని పరీక్షించాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. మరి భవిష్యత్తులో ఏమి జరగనుంది తెలియాల్సి ఉంది.