టీచర్.. లేకుండా పోయింది ఫ్యూచర్?

praveen
పిల్లలకు పాఠాలు చెప్పే ఆ టీచర్ కి ఇప్పుడు లేకుండా పోయింది ఫ్యూచర్.. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో కొన సాగాలని ఎన్నో కలలు కనీ ఇక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన వారు ప్రభుత్వ ఉద్యోగం రాక పోవడం తో ఇక ప్రైవేట్ స్కూళ్ల లో నైనా టీచర్ గా పని చేసి తమ కల నెరవేర్చు కోవాలని అనుకున్నారు. ఈ క్రమం లోనే ప్రస్తుతం ఎంతో మంది ఇక ప్రైవేట్ స్కూల్ టీచరుగా కొనసాగుతూ ఎంతో మందికి విద్యా బోధన చేస్తున్నారు.



 ఓవైపు చాలీ చాలని జీతాలు వస్తున్నప్పటికీ..  తాము కోరుకున్న వృత్తిలో కొనసాగు తున్నాము అనే సంతోషం లో జీవితాన్ని కాస్త కష్టం గానే ముందుకు నెట్టుకుంటూ వస్తున్నారు. ఇక అలాంటి ప్రైవేటు టీచర్ల జీవితాల పై ఏకంగా కరోనా వైరస్ గుదిబండలా మీద పడి పోయింది. ఏకంగా ఒక్క సారిగా వేల సంఖ్య లో ప్రైవేటు టీచర్లు ఉద్యోగాలు కోల్పోయారు.  కరోనా వైరస్ కారణం గా అటు విద్యా సంస్థలు మూత పడడం తో ప్రైవేట్ టీచర్లకు జీతాలు కూడా రాని పరిస్థితి నెలకొంది.  దీంతో ఇక జీవనాధారం లేక కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రైవేట్ టీచర్లు.



 అయితే కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో అటు తమ తమ స్కూల్లలో పనిచేస్తున్న టీచర్లను ఆదుకోవాల్సిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఎంతో దారుణం గా వ్యవహరించాయి.  ఓవైపు అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ అటు ప్రైవేటు స్కూల్ టీచర్లకు జీతాలు చెల్లించ లేదు. ఓవైపు జీతాలు లేక మరోవైపు స్కూల్స్ తెరుచుకునే పరిస్థితి లేక ప్రైవేట్ స్కూల్ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. దీంతో ప్రవేట్ స్కూల్ టీచర్లకు అసలు ఫ్యూచర్ అనేది లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: