కాస్ట్లీ కార్.. చీప్ మెంటాలిటీ.. వైరల్ ఫోటో?
అయితే ఇప్పుడు వరకు ఇక ద్విచక్రవాహనం వాడుతున్నవారు ఇలా చేయడం చూశాము.. కానీ ఇక్కడ ఏకంగా కాస్ట్లీ కారు కొనుగోలు చేసి ఛీప్ గా ఆలోచించారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంత కాస్ట్లీ కారు ఉన్నప్పటికీ జరిమానా తప్పించుకోవడానికి సదరు వ్యక్తి చేసిన పని మాత్రం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు పాలు అవుతుంది. ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేసిన ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ధనవంతులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎంతో చీప్ గా బిహేవ్ చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు.
మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ లొ బెంజి కారు నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్ పెట్టాడు. ఇక ఇది వెనుక నుండి ఫోటో తీశాడు ఒక వ్యక్తి. ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ ఫోటోకి అనుసంధానంగా ఒక కామెంట్ కూడా చేసాడు ఆ వ్యక్తి. కాస్లీ కార్స్ చీఫ్ మెంటాలిటీ అంటూ కామెంట్ చేస్తూ రాష్ట్ర పోలీసు విభాగంను కూడా ట్యాగ్ చేశారు. ఇక దీనిపై స్పందించిన సైబరాబాద్ పోలీసులు డేట్ టైం ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాము అంటూ రిప్లై ఇచ్చారు. ఇటీవలే సదరు వ్యక్తి పోస్టు చేసిన ఫోటో పై అటు ఎంతోమంది భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.