పంజ్ షీర్ వేట.. తాలిబన్ల మృత్యుబాట..!

NAGARJUNA NAKKA
ఆఫ్గాన్ ను ఆక్రమించిన తాలిబన్లకు పంజ్ షీర్ ప్రావిన్స్ కంటిలో నలుసులా తయారైంది. మసూద్ నేతృత్వంలోని  అక్కడి తిరుగుబాటు దళం తాలిబన్లపై యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. దీంతో దానిపై ఎన్నిసార్లు దండెత్తినా తాలిబన్లే వందల సంఖ్యలో చనిపోతున్నారు. అయితే వారిపై దాడి చేసేందుకు తాలిబన్లు.. అల్ ఖైదా సాయం కోరారు. దీంతో తాలిబన్ బృందాల్లో అల్ ఖైదా టెర్రరిస్టులు చేరారు. ఇక జరుగబోయే యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.

ఆఫ్ఘానిస్థాన్ లో ఇప్పటి వరకు 470మంది తాలిబన్లను హతమార్చామని పంజ్ షీర్ సేనలు ప్రకటించాయి. 390మందికి పైగా తాలిబన్లు గాయపడ్డారనీ.. 43మంది తమ నిర్బంధంలోనే ఉన్నారని తెలిపింది. 200మంది తాలిబన్లు లొంగిపోయారని పేర్కొన్నాయి. ఆప్ఘానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్ షీర్ సేనలు లొంగడం లేదు. దీంతో ఇరు వర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది. అయితే పంజ్ షీర్ ను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు అల్ ఖైదా సాయం కోరారు.  

కేవలం పంజ్ షీర్ నుంచే కాదు.. ఆప్ఘాన్ మహిళల నుంచి కూడా తాలిబన్లకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాలిబన్లు చెప్పినట్టుగా తాము సైలెంట్ ఇంట్లో కూర్చోబోమని ఆ దేశ మహిళా హక్కుల నేత ఫ్రిబా కబ్రజానీ స్పష్టం చేశారు. 30మంది మహిళలతో హెరాత్ ప్రావిన్స్ లో మహిళా హక్కుల కోసం ర్యాలీలు చేస్తున్నారు. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. మహిళలకూ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆప్ఘాన్ మహిళలు ఎన్నో త్యాగాలు చేశారని ఆమె గుర్తు చేశారు. ప్రపంచానికి తమ గొంతు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక ఆఫ్ఘానిస్థాన్ మట్టిలోనే టెర్రరిజం తయారుకావడం భారత్ ఆందోళనకు ప్రధాన కారణమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తు చేసింది. అందుకే తాలిబన్లపై భారత్ వైఖరి ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేసింది.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: